Wipro: 400 మంది ఉద్యోగులకు ఉధ్వాసన పలికిన విప్రో, ఎందుకో తెలుసా?
Wipro lays off 400 Freshers for Poor Performance
విప్రో కంపెనీ తాజాగా 400 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ 400 మంది కూడా విప్రోలో ట్రైనింగ్ తీసుకున్న వారే కావడం విశేషం. ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించిన వీరందరూ ఆశించిన స్థాయిలో పనిచేయని కారణంగా వీరిని ఉద్యోగాల నుంచి తీసేశారు. ఇంటికి పంపించారు.
అంతర్గత సామర్ధ్య పరీక్షలు (Internal assement tests) నిర్వహించి పనికిరాని వారి ఏరివేశారు. టెర్మినేషన్ లెటర్స్ అందించారు. సరైన ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ , ఆశించిన పనితీరు కనబడకపోవడం వల్లనే ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నామని వారందరికీ తెలియజేశారు.
కంపెనీ అందించిన ట్రైనింగ్ కోసం వారందరూ చెల్లించాల్సిన 75 వేల రూపాయలు చెల్లించాల్సిన పనిలేదని కంపెనీ తెలిపింది. ఈ విషయంలో వారికి మినహాయింపు ఇచ్చింది. కంపెనీ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందని, ఆ ప్రమాణాలకు అనుగుణంగానే ఉద్యోగస్థులు ఉండాలని కోరుకుంటున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.