Whats app: వాట్సాప్ యూజర్లకు శుభవార్త, త్వరలో మరో కొత్త ఫీచర్ చేరిక
WhatsApp will soon let users choose when group chats expire
వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువస్తోంది. యూజర్లను ఆకట్టుకుంటోంది. డిస్పేపియరింగ్ మెసేజెస్, వ్యూ వన్స్ ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ తాజాగా మరో ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. ఎక్స్ పైరింగ్ గ్రూప్ పేరిట మరో కొత్త ఫీచర్ త్వరలో యూజర్లను చేరనుంది.
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒక నిర్ణీత కాల వ్యవధి కోసం తాత్కాలిక గ్రూప్ లను క్రియేట్ చేయవచ్చు. ఆ కాల వ్యవధి దాటి పోగానే ఆ గ్రూపులు ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. టెస్టింగ్ పూర్తికాగానే యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తారు.
వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్లాలి. ఆ తర్వాత గ్రూప్ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్లాలి. దానిపై క్లిక్ చేయగానే ఎక్స్ పైరింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. కొత్తగా క్రియేట్ చేసిన గ్రూప్ ఎప్పటి వరకు ఉండాలో నిర్ణయించుకోవాలి. వాటిని అందులో ఫిల్ చేయాలి. నిర్ణయించిన తేదీ నాటికి ఆ గ్రూప్ ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. అదే విధంగా ఆ గ్రూప్ మరికొంత కాలం పొడిగించాలని అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఎక్స్ పైరింగ్ డేట్ ను ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. తద్వారా ఎంత కాలం అదనంగా కావాలని కోరుకుంటారో అంతకాలం కొనసాగించవచ్చు.