Whatsapp: యూకే మార్కెట్ వీడేందుకు సిద్ధమౌతున్న వాట్సాప్, ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
WhatsApp says will leave UK market if forced to stop end-to-end protection
వాట్సాప్ సంస్థ కీలక నిర్ణయం తీసుకోనుంది. యూకే మార్కెట్ ను వదిలేయడానికి సిద్ధమౌతోంది. యూకే ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న కీలక చట్టమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ విషయంలో రాజీ పడే బదులు యూకే మార్కెట్ ను వీడడమే ఉత్తమని భావిస్తోంది.
యూకే ప్రభుత్వం కొత్తగా ఆన్ లైన్ సేఫ్టీ బిల్లును తీసుకువస్తోంది. బోరిస్ జాన్సన్ సర్కార్ గతంలో దీనిని తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆ బిల్లుకు మోక్షం లభించే సమయం వచ్చింది. త్వరలోనే ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రకారం వాట్సాప్ సందేశాలను స్కాన్ చేయాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యక్రమాల నిరోధానికి, చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధానికి ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు యూకే ప్రభుత్వం చెబుతోంది.
యూకే ప్రభుత్వం తెస్తున్న కొత్త చట్టంపై వాట్సాప్ సంస్థ గుర్రుగా ఉంది. కొత్త బిల్లుపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ పద్దతిని వాట్సాప్ పాటిస్తోంది. మెసేజులు పంపేవారు, చదివేవారికి మాత్రమే వాట్సాప్ సేవలు అందిస్తోంది. అదే విధానం పాటిస్తోంది. తమ విధానం మార్చుకోవడం కుదరదని వాట్సాప్ హెడ్ క్యాత్ కార్టు స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 98 శాతం యూజర్ల కోసం యూకే మార్కెట్ ను వదులుకోడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యూకే ప్రభుత్వం తీసుకురానున్న బిల్లు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 98 శాతం మంది యూజర్లు ఇబ్బందులు పడతారని తెలిపింది.