Whatsapp New Features: వాట్సప్‌లో మార్పులు… కొత్త ఫీచర్లు ఇవే
Whatsapp New Features: వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అనేక మార్పులు చేసిన వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. పాపప్ ప్యానల్‌ను పూర్తిగా మార్చబొతున్నది. మొబైల్ నోటిఫికేషన్ తరహాలోనే ఐకాన్‌ను మార్చబోతున్నట్లు వాట్సప్ తెలియజేసింది. కొత్త వెర్షన్‌లో ఇది అందుబాటులోకి రాబోతున్నది. అంతేకాదు, వాట్సప్‌లో వ్యక్తికోసం సెర్చ్ చేస్తే ఆ పేరు మాత్రమే ఇప్పటి వరకు కనిపిస్తుంది. కాని ఇకపై ఆ వ్యక్తికి సభ్యత్వం ఉన్న గ్రూపుల వివరాలను కూడా పాపప్ అయ్యే విధంగా ఇంటర్‌ఫేజ్‌ను ఛేంజ్ చేయబోతున్నది. అయితే, ఈ మార్పు వలన ఉపయోగాల కంటే అనర్థాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరిగురించైనా సెర్చ్ చేసినపుడు ఆ వ్యక్తి సభ్యత్వం ఉన్న గ్రూపులు కూడా డిస్‌ప్లే అయితే, అది గోప్యతకు భంగం కలిగించే అంశం అవుతుంది.
ఇప్పటి వరకు కొత్త గ్రూపులో చేరాలంటే ఇన్విటేషన్ లింక్ క్లిక్ చేసి ఈజీగా గ్రూప్‌లో చేరేందుకు అవకాశం ఉండగా, ఇకపై గ్రూప్‌లో చేరాలి అంటే తప్పనిసరిగా గ్రూప్ అడ్మిన్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆమోదం పొందిన తరువాత మాత్రమే గ్రూప్‌లో చేరేందుకు అవకాశం ఉంటుంది. వాట్సప్ తెలియని వ్యక్తుల నుండి మెసెజ్ వచ్చినపుడు ఆ వ్యక్తులు ఎవరన్నది తెలియకపోవచ్చు. ఇకపై అలా జరగదని, వాట్సప్ గ్రూప్‌లో తెలియని వ్యక్తుల నుండి మెసెజ్ వచ్చినపుడు వాట్సప్‌లో అతను పెట్టుకున్న పేరుతో డిస్‌ప్లే అవుతుందని వాట్సప్ సంస్థ తెలియజేసింది. వీటితో పాటు మరికొన్ని ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.