Websites Down: మొరాయించిన వెబ్‌సైట్లు. కారణం ఏంటంటే?
Websites Down due to cloudflare problem: ఈ రోజు ఉదయం ప్రపంచవ్యాప్తంగా పలు వెబ్ సైట్లు, యాప్‌లు మొరాయించాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓపెన్ కాలేదు. సమస్య ఎందుకు వచ్చిందో యూజర్లకు అర్థంకాలేదు. దీంతో క్లౌడ్ ఫ్లేర్ సంస్థ స్పందించింది. తమ సర్వీసుల్లో లేదా నెట్‌వర్క్‌లో తలెత్తిన ఎర్రర్స్, టైమౌట్స్ లోపాలపై లోతుగా పరిశీలన జరుపుతున్నామని వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఒక స్టేటస్ పేజీని ప్రదర్శించింది.
మరో పావు గంటలో తదుపరి అప్డేట్ చూడొచ్చు అని పొద్దున 6 గంటల 43 నిమిషాల సమయంలో పేర్కొంది. చాలా దేశాల్లో వ్యాపార సంస్థలు ఈ క్లౌడ్ ఫ్లేర్ నే వాడుతున్నాయి. ఈ సంస్థ నెట్ వర్క్ ట్రాన్సిట్, ప్రాక్సీ, సెక్యూరిటీ ప్రొవైడర్ తదితర సేవలు అందిస్తోంది. ఇందులోనే ప్రాబ్లం వచ్చింది. దీంతో వెబ్ సైట్ల, యాప్‌ల యూజర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. జెరోధా యాప్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా స్పందించాయి.
కొన్ని ఐఎస్పీల్లో కనెక్టివిటీ ఇష్యూస్ ఎదురవుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయని, సమస్య పరిష్కారమయ్యే వరకు ఆల్టర్నేట్ ఇంటర్నెట్ కనెక్షన్ వాడాలని సూచించాయి. మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో మరో అప్డేట్ ఇచ్చాయి. ఎట్టకేలకు క్లౌడ్ ఫ్లేర్ నెట్ వర్క్ పనిచేస్తోందని, అన్ని వెబ్ సైట్లూ సాధారణంగానే ఓపెన్ అవుతున్నాయని తెలిపాయి. జెరోధా యాప్ ఒక్కటే కాదు. అమెజాన్, అప్ స్టోక్స్ వంటి యాప్స్ కూడా ఓపెన్ కాలేదు.