Web 3.0 Release soon: త్వరలో అందుబాటులోకి వెబ్ 3.0
Web 3.0 Release soon: వెబ్ వెర్షన్‌లో ప్రస్తుతం 2.0 అందుబాటులో ఉన్నది. కావలసిన సమాచారం మొత్తం వెబ్‌లో కావలసినంతగా దొరుకుతున్నది. అయితే, త్వరలోనే వెబ్ 3.0 వెర్షన్ రాబోతున్నది. అయితే, ఈ వెబ్ 3.0 వెర్షన్ ఎవరి నియంత్రణలో ఉండదని, కేవలం వినియోగదారుల నియంత్రణలో మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ స్పూర్తిగా వెబ్ 3.0ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 2.0 వెర్షన్ కొన్ని కంపెనీలు, ప్రభుత్వాల ఆధీనంలో నడుస్తున్నది. ప్రైవసీ విషయంలో ఇబ్బందులు వచ్చినా, తప్పుడు సమాచారం అందించినా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. అయితే, వెబ్ 3.0 వెర్షన్ విషయంలో అలాంటి ఉండకూడదని టెక్ నిపుణుల ఆలోచన.
యూజర్‌కు అవసరమైన సమాచారాన్ని ప్రపంచంలోని ఏ సర్వర్ నుండైనా తీసుకునే విధంగా రూపకల్పన చేస్తున్నారు. వెబ్ 2.0కి 3.0 మధ్య పెద్దగా వ్యత్యాసం లేకున్నా, నియంత్రణ విషయంలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ వెబ్ 3.0 అందుబాటులోకి అతిపెద్ద డేటాబేస్ కంపెనీలైన ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలు డేటాబేస్‌ను కొల్పోతాయి. అదేవిధంగా వెబ్ 3.0 పై ప్రభుత్వానికిగాని, పోలీసు వ్యవస్థ గాని అదుపుచేయడం కుదరదు. దీంతో నేరాలను అదుపుచేయడం మరింత కష్టం అవుతుంది. వీటిపై ప్రభుత్వాలకు అదుపు ఉందడు కాబట్టి, దానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయవలసి వస్తుంది. ఇక, ఈ వెబ్ 3.0 ఈఏడాది చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.