Vodafone: 9400 మంది ఉద్యోగులకు ఉధ్వాసన పలకనున్న వోడాఫోన్ సంస్థ
Vodafone plans hundreds of job cuts in the coming days
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అస్థిరతతో పలు కంపెనీలు కాస్ట్ కటింగ్ చేస్తున్నాయి. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. అనసరం లేని వారిని ఇంటికి పంపుతున్నాయి. తాజాగా వోడాఫోన్ సంస్థ కూడా అదే పని చేయడానికి సిద్ధమయింది. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ తీసుకున్న నిర్ణయం కారణంగా లండన్ లో పనిచేస్తున్న 9400 మందిపై ప్రభావం పడనుంది.
గత ఏడాది నవంబర్ నెలలో వోడాఫోన్ కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళికను వివరించింది. కాస్ట్ కటింగ్ ఏ విధంగా చేస్తామనే విషయాన్ని కూడా క్లియర్ గా ప్రకటించింది. 2026 నాటికి ఒక బిలియన్ యూరోల ఖర్చును తగ్గించనున్నట్లు స్పష్టంగా వెల్లడించింది.
2022 చివర్లో వోడా కంపెనీ సీఈఓగా ఉన్న నిక్ రెడ్ పదవి నుంచి తప్పకున్నారు. ఆ స్థానంలో మార్గరిటా డెల్లా చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గా సంస్థలో అడుగు పెట్టారు. ఈ మార్పులు జరిగిన తర్వాత కంపెనీ పనితీరుపై సమీక్ష జరిగింది. కంపెనీ ఆపరేటింగ్ మోడల్ పై సమీక్ష చేపట్టి ప్రక్షాళణ చేపడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Vodafone plans major job cuts to reduce cost pic.twitter.com/YBGPZfTqor
— Rakesh Bansal (@iamrakeshbansal) January 14, 2023