UPI Payments: ఇండియన్ మొబైల్ నెంబర్లు లేకుండానే NRI లకు యూపీఐ సేవలు
UPI Payments for NRIs without having an Indian Number
నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 10 దేశాలకు చెందిన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా ఇక నుంచి యూపీఐ సేవలను వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది.అమెరికా, యూకే, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా,ఒమన్, ఖతార్, ఎమిరేట్స్, సౌదీ అరేబియా, హాంగ్ కాంగ్ దేశాలకు చెందిన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కు ఈ అవకాశం కలగనుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రకటించిన 10 దేశాలకు చెందిన ఎన్.ఆర్.ఐలు తమ అంతర్జాతీయ నెంబర్ల ద్వారానే యూపీఐ చెల్లింపులు జరుగుకునే అవకాశం ఉంది.ఇండియన్ మొబైల్ నెంబర్ లేకపోయినా ఈ చెల్లింపులు జరుపుకునే అవకాశం కలగనుంది. నాన్ రెసిడెంట్ రూపీ, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికే ఈ సౌకర్యం అందనుంది.
ఇప్పటి వరకు ఇండియన్ సిమ్ కార్డు కలిగిన వారికి మాత్రమే యూపీఐ సేవలు అందుబాటులో ఉండేవి. ఇక నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ కు ప్రకటించిన 10 దేశాల ఎన్.ఆర్.ఐలు కూడా యూపీఐ చెల్లింపులు చేసుకునే అవకాశం కలగనుంది.
గత ఏడాది చివరి నెలలో యూపీఐ లావాదేవీలు 12.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రతి దేశానికి ఆ దేశానికి సంబంధించిన కోడ్ నెంబర్లు కొన్ని ఉంటాయి. ఆ కోడ్ నెంబర్లు ఉపయోగించడం ద్వారా యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చు.ప్రస్తుతం 10 దేశాలకు చెందిన ఎన్.ఆర్.ఐలకు మాత్రమే అందుబాటులోకి రానున్న యూపీఐ సేవలు రానున్న కాలంలో మరింతగా విస్తరించనున్నాయి.