Twitter: ట్విట్టర్ మేకోవర్, అందుబాటులో అదనపు ఫీచర్లు
Twitter to Get New Navigation Features
ట్విట్టర్ సంస్థ అనేక మార్పులు తీసుకొచ్చేందుకు అధినేత ఎలాన్ మస్క్ కృషి చేస్తున్నాడు. కొత్త సంవత్సరంలో కొత్త కొత్త మార్పులతో వినియోగదారులను అలరించనున్నాడు. ట్వీట్ చేసే పదాల పరిమితిని కూడా పెంచనున్నాడు.
ట్విట్టర్ సంస్థ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న ఎలాన్ మస్క్ వినియోగదారుల సంఖ్యను మరింత పెంచే విధంగానే చర్యలు తీసుకుంటున్నాడు. ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించినా, యూజర్స్ గురించి మాత్రం కొత్త కొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యాడు.
యూజర్ ఇంటర్‌ఫేస్‌ను పూర్తిగా మార్చాలని భావిస్తున్నాడు. కొత్త మార్పులు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. అదే విధంగా నావిగేషన్ ఫీచర్లు కూడా మారనున్నాయి.
లాంగ్ టెర్మ్ ట్వీట్లు చేయడానికి ఫిబ్రవరి వరకు ఆగాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలోనే పదాలపై నియంత్రణ తొలగనుంది. మరింత పెద్ద ట్వీట్లు చేసే అవకాశం కలగనుంది.
ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశాడు. కొన్నతర్వాత అనేక మార్పులకు శ్రీకారం చుట్టాడు. అనవసరం అనుకున్న ఉద్యోగులను ఇంటికి పంపాడు. కీలక పదవుల్లో ఉన్నపరాగ్ అగర్వాల్, విజయ గద్దె వంటి వాళ్లను నిర్ధాక్షిణ్యంగా తొలగించాడు. తనకు నచ్చిన విధానాలను అమలు చేస్తున్నాడు. ఎవరెన్ని అనుకున్నా తన పంథాలోనే ముందుకు సాగుతున్నాడు.