Twitter Down: ట్విట్టర్లో సాంకేతిక సమస్య, లాగిన్ సమస్యలతో యూజర్లు సతమతం
Twitter goes down with users unable to view tweets
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ టెక్నికల్ సమస్య ఎదుర్కొంటోంది. కొన్ని ప్రాంతాల్లో ట్విట్టర్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో యూజర్లు ఫిర్యాదులు మొదలు పెట్టారు. మరికొందరు మీమ్స్ తో హల్ చల్ చేస్తున్నారు. 50 మంది ఇంజనీర్లను తొలగించిన ఎలాన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో ఈ టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తున్నాడని కొన్ని ఫోటోలను ట్వీట్ చేస్తున్నారు.
ట్విట్టర్ డౌన్ అయిన ప్రదేశాల్లో ఒక మెసేజ్ దర్శనమిస్తోంది. వెల్కమ్ టు ట్విట్టర్, దిస్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ టు సీ వాట్స్ హ్యాప్పినింగ్ ఇన్ ది వరల్డ్. ఫైండ్ సమ్ పీపుల్ అండ్ టాపిక్స్ టు ఫాలో ఆన్ అని మెసేజ్ కనిపిస్తోంది. యూజర్లు చేస్తున్న ట్వీట్లు వారికి కనిపించడం లేదు.
అనేక మార్పులు చేర్పులు
ట్విట్టర్ సంస్థ ఎలాన్ మస్క్ చేతిల్లోకి వచ్చిన నాటి నుంచి అనేక మార్పులు చేర్పులకు లోనవుతోంది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను ఇంటికి పంపడం సాధారణంగా మారింది. అనేక దేశాల్లో ఆఫీసులను మూసివేశారు.
Twitter's timeline is currently down, users are unable to refresh or load it on both the app and on web. pic.twitter.com/QuhbMmwkuh
— Pop Base (@PopBase) March 1, 2023
Is Twitter down? pic.twitter.com/sespJtc58b
— Yukki (@KoushanM) March 1, 2023
Elon Musk trying to fix twitter. #TwitterDown pic.twitter.com/S5TD2nVqol
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 1, 2023
Twitter Down