Twitter: ట్విట్టర్ వినియోగదారులకు శుభవార్త, పదాల పెంపు 10వేలకు చేరే అవకాశం
Twitter extending tweets limit by 10,000 characters
ట్విట్టర్ సంస్థ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ట్వీట్స్ చేసే పదాలను 10 వేలకు చేర్చాలని నిర్ణయించాలని భావిస్తోంది. స్వయంగా ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ఈ విషయమై చేసిన ఓ ట్వీట్ చెప్పకనే చెప్పింది. బ్లూ టిక్ ఉన్న వారికే ఇది వర్తిస్తుందా లేదా అందరికీ వర్తిస్తుందా అనే విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు.
ట్విట్టర్ పదాల పరిమితిని పెంచాలని అనేక నెలలుగా విన్నపాలు వస్తునే ఉన్నాయి. 2017లో తొలిసారిగా ట్వీట్స్ లిమిట్ పెంచారు. అప్పటి వరకు ఉన్న 140 పదాల పరిమితిని రెట్టింపు చేశారు. 280 పదాలకు పెంచారు. కొన్ని వారాల క్రితం ట్విట్టర్ సంస్థ ట్వీట్ల పదాల పరిమితి విషయంలో ఓ విషయం వెల్లడించింది. అమెరికాలో బ్లూ సబ్ స్క్రైబర్లకు 4000 పదాల పరిమితిని అందిస్తామని తెలిపింది. ఆ విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు.
ట్విట్టర్ వినియోగదారుల సంఖ్య కోట్లలో ఉంది. అందులో బ్లూ సబ్ స్క్రైబర్ల సంఖ్య చాలా చాలా తక్కువుగా ఉంది. మొత్తం వినియోగదారుల్లో కేవలం 0.2 శాతం మంది మాత్రమే బ్లూ సబ్ స్క్రైబర్లుగా మారారు. కేవలం లక్షా 80 వేల మంది మాత్రమే డబ్బులు చెల్లించి సేవలను పొందుతున్నారు. వీరి వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువుగా ఉంది. ఇటువంటి వారే సంస్థకు ఆదాయం తెచ్చే వారని ఎలాన్ మస్క్ ఎప్పుడో వెల్లడించారు. ప్రస్తుతం ట్వీట్స్ లిమిట్ చెల్లింపుదారులకే పెంచడం ద్వారా కూడా మరింత డబ్బు వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది.