Twitter accuses Microsoft of exploiting its data
మైక్రోసాఫ్ట్ సంస్థపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. చాట్‌జీపీటీ వంటి సేవలను అందిస్తున్న మైక్రోసాఫ్ట్ సంస్థ ఆ సంస్థ భాగస్వామి అయిన ఓపెన్ ఏఐ ట్విట్టర్ డేటాను అక్రమంగా వినియోగిస్తున్నారని ఎలాన్ మస్క్ గత నెలలో ఆరోపించాడు. తాజాగా మైక్రోసాఫ్ సంస్థపై మరికొన్ని ఆరోపణలు చేశాడు.
మైక్రోసాఫ్ట్ సంస్థ ట్విట్టర్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, పరిమితి కన్నా చాలా ఎక్కువుగా ట్వీట్ల నుంచి సమాచారం సేకరిస్తోందని ఎలాన్ మస్క్ ఆరోపించాడు. కేవలం 2022 ఒక్క సంవత్సరంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ 26 బిలియన్ల ట్వీట్లను రిట్రీవ్ చేసిందని ఎలాన్ మస్క్ ఆధారాలను బయట పెట్టాడు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ట్రైనింగ్ కోసం అపరిమితమైన డేటా అవసరం ఉంటుందని, అటువంటి డేటాను ట్విట్టర్ నుంచి సేకరించే సమయంలో తమకు సమాచారం ఇవ్వలేదని ఎలాన్ మస్క్ వాదన.