TCS U trun: వర్క్ ఫ్రం హోంకు గుడ్ బై, ఆఫీసులకు ఖచ్చితంగా రావాలంటూ ఆదేశాలు
TCS ends work from Home concept, ask employees to come to office
టీసీఎస్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వర్క్ ఫ్రం హోం కుదరదని స్పష్టం చేసింది. ఖచ్చితంగా ఆఫీసుకు రావాలని ఆర్డర్లు జారీ చేసింది. దీంతో ఇంత కాలంగా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న ఉద్యోగులకు షాక్ తగిలింది. ఇంటి వద్దనే ఉంటూ ఒకే వ్యక్తి రెండేసి కంపెనీల పనిని చేస్తూ రెండు చేతులా సంపాదించారు. ఇక నుంచి అలా చేసే అవకాశం లేకుండా పోనుంది.
ఉద్యోగులందరూ ఆఫీసులకు ఖచ్చితంగా రావాలని స్పష్టం చేసింది. ఆఫీసు కల్చర్ కు తిరిగి అలవాటుపడాలని, సహచర ఉద్యోగులతో తమ అనుభవాలను పంచుకోవాలని తెలిపింది.గత ఏడాదిలో టీసీఎస్ కంపెనీ ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించింది. సూపర్ వైజర్ల పర్యవేక్షణలో ఉంటూ వారానికి మూడు రోజుల పాటు ఆఫీసుకు వచ్చేలా అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ విధానానికి కూడా స్పస్తి పలికింది.
ఆఫీసుకు రావడం ద్వారా మరిన్ని పనులు చేయడం సాధ్యపడుతుందని సంస్థ సీనియర్ ఉద్యోగులు తెలిపారు. గత రెండు సంవత్సరాల కాలంలో కొత్త ఉద్యోగం చేరిన వారు ఆపీస్ కల్చర్ కు అలవాడు పడాలని సీనియర్లు భావిస్తున్నారు. క్లయింట్లు కూడా ఆఫీసులకు వస్తున్న ప్రస్తుత తరుణంలో అందరు ఉద్యోగులు కూడా ఆపీసుకు రావడమే సరైన విధానమని సీనియర్లు అంటున్నారు.
ఆఫీసుకు రావడం వల్ల లెర్నింగ్, షేరింగ్ వంటి సాధ్యపడతాయని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గణపతి సుబ్రహ్మణ్యం తెలిపారు.హైబ్రిడ్ మోడ్ ఆఫ్ వర్క్ అలవాటు చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. వర్క్ ఫ్రం హోం విధానం వందశాతం తీసివేశామని, ఇక నుంచి తరచుగా ఆపీసుకు రావలసి ఉంటుందని స్పష్టం చేశారు.