Tata Group: ఐఫోన్ తయారీలోకి రంగంలోకి టాటా గ్రూప్..
Tata Group Enters the IPhone Sector: దేశంలో గుండి పిన్ను నుంచి విమానయాన సంస్థల వరకు అన్ని రంగాల్లో పెడ్డుబడులు పెట్టిన ప్రముఖ దేశీయ సంస్థ అయిన టాటా సంస్థ మరో రంగంలోకి అడుగుపెట్టబోతుంది. తాజాగా యాపిల్ ఫోన్ తయారీ సంస్థతో చేతులు కలపబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇందు కోసం తైవాన్‌కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్‌తో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. విస్ట్రన్‌తో కలిసి ఎలక్ట్రానిక్ జాయింట్ వెంచర్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలని ఆ గ్రూప్ భావిస్తోంది. ఫోన్ల ఉత్పత్తి, సప్లయ్ చైన్, అసెంబ్లింగ్‌లో విస్ట్రన్ కార్పొరేషన్ నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని టాటా గ్రూప్ భావిస్తోంది.
ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ అవతరించనుంది. యాపిల్‌కు చెందిన ఐఫోన్లను తైవాన్‌కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ పనిచేస్తుంది. భారత్, చైనా దేశాల్లోకి ఇవి ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువ శాతం కంపెనీలు ఫోన్ల తయారీ విషయంలో చైనా పైనే ఆధారపడుతుండగా.. కొవిడ్ లాక్‌డౌన్‌లు, అమెరికాతో విభేదాల వంటి కారణాలతో చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. యాపిల్ సైతం చైనాతో పాటు ఇతర దేశాల్లోనూ తయారీ చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే టాటా గ్రూప్ విస్ట్రన్ గ్రూప్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.