Microsoft: మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం, ఏం జరిగిందంటే..
Several Microsoft Services disrupted globally
మైక్రోసాఫ్ట్ సంస్థ అందిస్తున్న అనేక సేవల్లో అంతరాయం ఏర్పడింది.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత చాలా ఏళ్లుగా మైక్రోసాఫ్ట్ సంస్థ అందిస్తున్న సేవలను వినియోగించుకుంటున్న కంపెనీలు ప్రస్తుతం తల పట్టుకుంటున్నాయి. ఎక్స్ బాక్స్, ఔట్ లుక్, మైక్రోసాఫ్ట 365 , క్లౌడ్ ప్లాట్ ఫామ్ అజ్యుర్.. తదితర సేవల్లో అంతరాయం కలిగిన మాట వాస్తవమేనని, సత్వరమే పరిష్కరించేందుకు ప్రయత్నం జరుగుతోందని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
అజ్యుర్ సేవలు అమెరికా, యూరోప్, ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో సరిగ్గా పనిచేయడం లేదని ఆ సంస్థ వెల్లడించింది. చైనాలో మాత్రమే ఈ సేవలకు ఎటువంటి అంతరాయం కలగలేదని సంస్థ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ అందిస్తున్న అజ్యుర్ సేవలు చాలా దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలు వినియోగిస్తున్నాయి. వాటిలో అంతరాయం ఏర్పడడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ సంస్థకు అజ్యుర్ సేవలు గత ఏడాదిలో కూడా కొంత ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన సేవల్లో అంతరాయం కలగడంతో అనేక మంది ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ టీమ్స్, షేర్ పాయింట్ ఆన్ లైన్, వన్ డ్రైవ్ ఫర్ బిజినెస్ తదితర సేవలకు కూడా అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవలే 10 వేల మంది ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించింది. ఆ ప్రభావం ప్రస్తుత సేవల అంతరాయానికి కారణమా అనే సందేహాలు కలుగుతున్నాయి.
We’ve isolated the problem to networking configuration issues, and we're analyzing the best mitigation strategy to address these without causing additional impact. Refer to the admin center MO502273 or https://t.co/lZs9s6KLnh for more information.
— Microsoft 365 Status (@MSFT365Status) January 25, 2023
We are aware that multiple Xbox services experienced intermittent issues, but all services should be recovered at this time. Thank you for your patience, and happy gaming.
— Xbox Support (@XboxSupport) January 25, 2023
Microsoft