రకరకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇప్పటి జనరేషన్ జీవితంలో ఓ భాగంగా మారిపోయాయని యూఎస్ కేంద్రంగా వన్‌పోల్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
Social media : జనరేషన్ మారింది.. జనరేషన్‌తో పాటు కాలం మారుతోంది. కాలంతో పాటు టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో అప్ డేట్‌తో మనుష్యుల్లో టెక్నాలజీ అల్లుకుపోయింది. అందుకేనేమో కాలంతో పాటు పరుగులు పెడుతూనే మనుష్యులంతా టెక్నాలజీకి బంధీ అయిపోతున్నారు.స్మార్ట్ ఫోన్ తోనే స్మార్టుగా తమ జీవితాలను అల్లేసుకుంటున్నారు. ఈ విషయంలో యూత్‌తో పాటు పెద్దవాళ్లు కూడా పోటీపడుతున్నారు
పొద్దున లేచింది మొదలు పడుకునే వరకూ సోషల్ మీడియా(social media)లోనే గడిపేస్తున్నారు.రోజులో పక్కనే ఉన్న మనిషిని పలకరించకపోయినా.. లేచాక తొలి పలకరింపు, పడుకునే ముందు చెప్పే విషెస్ అన్నీ సోషల్ మీడియాలోనే చెప్పుకుంటున్నారు. అయితే రకరకాల సోషల్ మీడియా(social media) ప్లాట్‌ఫామ్స్ ఇప్పటి జనరేషన్ జీవితంలో ఓ భాగంగా మారిపోయాయని యూఎస్ కేంద్రంగా వన్‌పోల్(One Pole) సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
వాట్సాప్(WhatsApp),టెలిగ్రామ్(Telegram), ఫేస్ బుక్(Facebook), ఇన్స్టాగ్రామ్(Instagram), థ్రెడ్స్(Treds), యూ ట్యూబ్(Youtube), ఎక్స్(X) ప్లాట్‌ఫామ్, షేర్ చాట్(Share Chat) ఇలా అన్నిటిలోనూ అకౌంట్స్ క్రియేట్ చేసి మరీ తమ డైలీ లైఫ్‌లో ఎక్కువ భాగాన్ని అందులోనే గడిపేస్తున్నారు. సుమారు 10,000 మందిపై ప్రపంచవ్యాప్తంగా సర్వే నిర్వహించగా 65 శాతంకంటే ఎక్కువ మంది రోజుకు 7 నుంచి 10 సార్లు ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియా సైట్లను కానీ, యాప్‌లను చెక్ చేస్తున్నారట. ఈ మధ్య థ్రెడ్స్ యాప్‌ను ప్రారంభించిన యూఎస్ టెక్ కంపెనీ అయిన మెటా అధ్యయనంలో ఇదే విషయం తేలింది.
ఒక విధంగా చెప్పాలంటే.. అంతకుముందుతో పోల్చితే సగటున రోజుకు మూడు గంటలకు పైగా వాడేవాళ్లు ఎక్కువ అయ్యారని సర్వేలు చెబుతున్నాయి.ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాప్స్, ఆన్ లైన్ షాపింగ్స్, ఇతర వెబ్‌సైట్స్ అందరినీ ఆకట్టుకునేలా మారడంతో పాటు చాలామందికి ఇవి అందుబాటులోకి రావడంతో యూజర్లు పెరిగిపోతున్నారు.
వన్‌పోల్ (One Pole)సర్వేను అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కేవలం 2023 సంవత్సరం తొలి సగంలోనే.. ప్రపంచవ్యాప్తంగా 4. బిలియన్ల మందికి పైగా యూత్.. సోషల్ మీడియాతో ఒక విడదీయలేని భాగంగా మార్చేసుకున్నారట. దానిలోనే సంతోషం, సమాచారం తెలుసుకోవడం, కాలక్షేపం చేసే వారితో పాటు కెరీర్ కోసం ఉపయోగపడే జాబ్ సెర్చింగ్ల కోసం, చదువు కోసం చూసేవాళ్లు కూడా ఉంటున్నారట.
చివరకు ఒక్క రోజు కూడా సోషల్ మీడియా(social media)ను చూడకుండా ఉండలేని స్టేజికి వెళ్లిపోతూ దానికి ఎడిక్ట్ అయిపోతున్నారట. దాదాపు 92 శాతం మందికి కనీసం ఏవో రెండయినా సోషల్ మీడియా అకౌంట్లు ఉంటున్నాయట. మొబైల్ వల్ల రేడియేషన్ ఎపెక్ట్ ఉంటుందని చెబుతున్నా.. పక్కన పెట్టుకునే పడుకుంటున్నారట. నిజానికి అది లేకపోతే నిద్ర రాదేమో అన్నఫీలింగ్లోకి వెళ్లిపోతున్నారట. ఇంకొంతమంది అయితే మధ్యలో లేచి మరీ వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్ వంటి వాటిని చెక్ చేసుకుంటున్నారట. ఏది ఏమయినా ఇది అందరి ఆరోగ్యానికి చేటు కాబట్టి.. కాస్త మెల్లమెల్లగా సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయట పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.