ISRO: ఇస్రో మరో ఘనత, ఒకేరోజు 36 శాటిలైట్ల ప్రయోగం
OneWeb to launch 36 satellites with ISRO
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ..ఇస్రో మరో ఘనతను సొంతం చేసుకోనుంది. ఈ నెల 26న ఏకంగా 36 శాటిలైట్లు ప్రయోగించనుంది. యూకేకు చెందిన వన్ వెబ్ సంస్థ శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టనుంది. మార్చి 26 వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. యూ ట్యూబ్ తో పాటు సోషల్ మీడియా ఖాతాల్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఎయిర్ టెల్ మాతృసంస్థ భారతీ ఎంటర్ ప్రైజెస్ భాగస్వామ్యంలో యూకేకు చెందిన వన్ వెబ్ సంస్థ శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టనుంది.
2030 నుంచి స్సేస్ టూరిజం
అంతరిక్షంలో పర్యాటకులను తీసుకువెళ్లేందుకు కూడా ఇస్రో ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. 2030 నుంచి టూరిస్టులను స్పేస్ లోకి తీసుకువెళ్లేందుకు ఇస్రో ప్లాన్ చేస్తోంది. ఒక్కక్క టూరిస్టు నుంచి 6 కోట్ల వసూలు చేయాలని ఇస్రో భావిస్తోంది. ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ స్పేస్ టూరిజం విషయాన్ని వెల్లడించారు.
అంతరిక్ష పర్యటనకు వచ్చే టూరిస్టులను ఆస్ట్రోనాట్స్ అని అనవచ్చని ఇస్రో చైర్మన్ తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా స్పేస్ టూరిజం గురించి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రాజ్యసభలో ప్రస్తావించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించారు.