Nokia New Logo: సరికొత్త లోగోతో నోకియా రీ బ్రాండింగ్ స్ట్రాటజీ
Nokia re branding Strategy with New logo
ప్రపంచ ప్రఖ్యాత నోకియా సంస్థ కొత్త రూపు సంతరించుకుంది. తమ కంపెనీ లోగోను మార్చుకుంది. కొత్త లోగోతో మార్కెట్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. 60 ఏళ్లుగా కొనసాగుతున్న పాత లోగోను మార్చాలని నిర్ణయించింది. లోగోను మార్చడంతో పాటు వ్యాపార వ్యూహాలను కూడా మార్చుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తమ బ్రాండ్ ను మరింత విస్తరించాలని నిర్ణయించింది.
బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో సీఈఓ లండ్ మార్క్ తమ కంపెనీలో జరుగుతున్న మార్పుల గురించి వివరించారు. నోకియా అనేది ఇక నుంచి కేవలం ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ మాత్రమే కాదని, బిజినెస్ టెక్నాలజీ కంపెనీ అని అన్నారు. అమేజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీలతో పోటీ పడే విధంగా మార్కెట్ విస్తరణ చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సీఈఓ వెల్లడించారు. గత ఏడాది కంపెనీలో 21 శాతం గ్రోత్ కనిపించిందని, వీలైనంత త్వరగా దానిని రెట్టింపు చేయాలనే విధానంతో కంపెనీ అడుగులు వేయనుందని సీఈఓ వెల్లడించారు. ఈ ఏడాది రెండో భాగంలో నార్త్ అమెరికా మార్కెట్ నుంచి ఎక్కువ లాభాలు ఆశిస్తున్నట్లు సీఈఓ తెలిపారు.
కొత్త లోగోపై సోషల్ మీడియాలో అనేక కామెంట్లు వస్తున్నాయి. నోకియ పాత లోగోయే బాగుందని కొందరు అభిప్రాయపడ్డారు. కనెక్టింగ్ పీపుల్ అంటూ వచ్చే ఆ లోగోను త్వరగా మరిచిపోలేమని ట్వీట్స్ చేస్తున్నారు. మరికొందరు కొత్త లోగోను స్వాగతించారు. నోకియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Nokia finally changed their logo pic.twitter.com/xOMWfaOnYt
— Haadi (@iHaadiYT) February 27, 2023
So this is the new Nokia logo. Thoughts? pic.twitter.com/Uwe5O8BNno
— Ilya Miskov (@ilyamiskov) February 26, 2023
Nokia has a New Logo
pic.twitter.com/AlKDh9mqMn— Mustafa Ergisi (@mustafaergisi) February 26, 2023
Meanwhile… The New NOKIA logo! What are your thoughts as they rebrand after many decades, not as a mobile phone company, but as an Innovation and Tech company; Focusing more on mobile, fixed and cloud networks? #Nokia #Nokialogo #rebranding #nokiarebranding pic.twitter.com/qVqP1y22or
— Uche Iheanacho (@uche_jazzy) February 27, 2023
The new Nokia logo is mathematically correct. pic.twitter.com/uKu5O0kry8
— Arto Vartiainen (@artovartiainen) February 26, 2023
If you are eliminating vertical components from logo , then remove ‘I’ also. #Nokia pic.twitter.com/WclL5o0GZ6
— Anupam Biswas (@flyanupam) February 27, 2023
Nokia New Logo