EV vehicles : మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
More than 18 lakh electric vehicles registered in India
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమక్రమంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 18 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ జరిగినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలు ఈవీ వాడకంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు మంత్రి వివరించారు. రాజ్యసభకు అందిని లిఖిత సమాధానంలో మంత్రి గడ్కరీ ఈ విషయాలను వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లో 4,14,978, ఢిల్లీలో 1,83,074, మహారాష్ట్రలో 1,79,087 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు మంత్రి రాజ్యసభకు ఇచ్చిన సమాచారంలో తెలిపారు.
అదే విధంగా చార్జింగ్ స్టేషన్ల విషయంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 660 చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీలో 539 చార్జింగ్ స్టేషన్లు, తమిళనాడులో 439 చార్జింగ్ స్టేషన్లు ఉన్నట్లు గడ్కరీ తెలిపారు. దేశ వ్యాప్తంగా మొత్తం 5151 చార్జింగ్ స్టేషన్లు ఉన్నట్లు గడ్కరీ తెలిపారు.