Meta layoffs: మెటాలో ఉద్యోగాల కోత, ఈ వారంలో 11 వేల మందికి ఉధ్వాసన
Meta to lay off thousands of employees in the coming week, sources says
ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగులకు ఉధ్వాసన పలుకుతున్నాయి. ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకునేందుకు కంపెనీకు భారంగా మారుతులన్న ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దిగ్గజ కంపెనీలు ఎన్నో అదే బాటలో పయనిస్తున్నాయి. ఆర్ధిక లక్ష్యాలను చేరుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వేలాది మందిని ఒక్కసారిగా ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నాయి. కోతల ప్రక్రియను విడతల వారీగా అమలు చేస్తున్నాయి.
తాజాగా మెటా సంస్థ కూడా అదే బాటను అనుసరిస్తోంది. గత ఏడాది అక్టోబర్ నెలలో వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన ఆ కంపెనీ తాజాగా మరోసారి 11 వేల మంది ఉద్యోగులపై వేటు వేయనుందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కంపెనీలోని డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు ఉద్యోగులను తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. ఎవరిని పనిలోంచి తీసివేయాలో గుర్తిస్తున్నారు. వారికి అందిన ఆదేశాల ప్రకారం కంపెనీకి అక్కరలేని వారిని గుర్తిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
మెటా కంపెనీ సీఈఓ 2023 వ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ గా ప్రకటించిన మార్క్ జుకర్ బెర్గ్ ఇటీవలే పెర్ఫార్మెన్స్ రివ్యూ చేపట్టారు. పెర్ఫార్మెన్స్ రివ్యూ ఆధారంగానే ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలి అనే విషయంలో ఓ నిర్ణయానికి రానున్నారు.