Kautilya Kataria: టెక్ దిగ్గజాలను ఔరా అనిపిస్తున్న కౌటిల్య కటారియా
Kautilya Kataria became Popular Worldwide due to his Coding Skills
టెక్ రంగంలో ఓ చిచ్చరపిడుగు శరవేగంగా దూసుకుపోతున్నాడు. దిగ్గజాలను సైతం ఔరా అనిపిస్తున్నాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఎదిగాడు. పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలకు సైతం పాఠాలు నేర్పిస్తున్నాడు. ప్రశంసలు అందుకుంటున్నాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కటారియా చిన్న వయసు నుంచే తన ప్రతిభను చాటుకుంటున్నాడు. చిన్న వయసులో తన తండ్రి ఇచ్చిన ఓ కోడింగ్ పుస్తకం కటారియా జీవితాన్ని మార్చేసింది. తనలోని ప్రతిభను బయటపెట్టింది. అప్పటి నుంచి కటారియా తన ప్రతిభను చాటుకుంటూ వస్తున్నాడు. ఆరేళ్ల వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రామర్ అనిపించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసు కలిగిన ప్రోగ్రామర్ గా అవతరించాడు.
ప్రస్తుతం కటారియా వయస్సు 9 సంవత్సరాలు.ఈ వయసులో పెద్ద పెద్ద కంపెనీలకు సలహాలను ఇస్తున్నాడు. కాన్ఫరెన్స్ లో పాల్గొంటూ ప్రసంగాలు చేస్తున్నారు. టెక్ దిగ్జజాలను ఔరా అనిపిస్తున్నాడు.