ISRO: కాలం చెల్లిన ఉపగ్రహం, కూల్చేందుకు రంగం సిద్ధం
Isro to attempt controlled re-entry of decommissioned satellite
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఓ సరికొత్త సవాలును స్వీకరించింది. ఉపగ్రహ శకలాలు మానవాళికి ప్రమాదం కాకుండా చర్యలు మొదలు పెట్టింది. కాలం చెల్లిన ఉపగ్రహాలను ఒక క్రమపద్దతిలో కూల్చివేసేందకు సమాయత్తం అవుతోంది. ఈ విధానం ద్వారా సముద్ర గర్భంలో కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల లోపు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
తక్కువ భూ కక్షలో పరిభ్రమించే మేఘా ట్రోపికస్ అనే ఉపగ్రహాన్ని ఎంపిక చేసుకుంది. 2011లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం 2021 వరకు సేవలు అందించింది. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఈ ఉపగ్రహాన్ని కూల్చేందుకు ఇస్రో సమాయత్తం అయింది. ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనే కూల్చివేసే కెపాసిటీ భారతదేశానికి ఉంది. అలా చేయడం ద్వారా ఉపగ్రహ శకలాలు భవిష్యత్తులో సమస్మాత్మకంగా మారుతాయని భావించింది. ఈ నేపథ్యంలో ఒక నియంత్రితి విధానం ద్వారా సముద్ర గర్భంలో కూల్చేందుకు నిర్ణయించింది.
అంతరిక్షంలో ఉపగ్రహ శకలాలు ఎక్కువుగా ఉండే రానున్న కాలంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున డెబ్రిస్ కో ఆర్డినేషన్ కమిటీ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న అన్ని దేశాలు ఈ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఈ సూచనల నేపథ్యంలో ఇస్రో ఈ సవాలును స్వీకరించింది.