OS 17: గ్లోబల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ (Apple) కు ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కస్టమర్లకు (Coustemers) అనుగునంగా యాపిల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడుతూ వస్తోంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ అప్డేట్స్ (Software update) కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంది.
iOS 17: గ్లోబల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ (Apple) కు ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కస్టమర్లకు (Coustemers) అనుగునంగా యాపిల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడుతూ వస్తోంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ అప్డేట్స్ (Software update) కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఐఓఎస్ 16 (IOS 16) వెర్షన్ యాపిల్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ 17 (IOS 17) ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది యాపిల్. జూన్ 5న జరగనున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఐఓఎస్ 17ను రిలీజ్ చేయనుంది.
ఇక ఈసారి అద్భుతమైన ఫీచర్లతో ఐఓఎస్ 17ను యాపిల్ తీసుకొస్తోంది. ముఖ్యంగా అంధులు, వికలాంగులకు ఉపయోగపడేలా సరికొత్త ఫీచర్లను పరిచయం చేయబోతోంది. మాటలు రాని మూగవారి కోసం పర్సనల్ వాయిస్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఎవరైతే మాటలు రాని వారు ఉంటారో.. వారు మ్యాటర్ టైప్ చేస్తే.. దానిని మన వాయిస్‌తో మాటల రూపంలో వినిపిస్తుంది. అలాగే దృష్టిలోపం ఉన్న వారికోసం కూడా ప్రత్యేకంగా పాయింట్, స్పీక్ టెక్స్ట్ అనే ఫీచర్లను తీసుకొస్తోంది.
ఇకపోతే త్వరలో అందుబాటులోకి రాబోయే ఐఓఎస్ 17 అన్ని యాపిల్ ఫోన్లలో సపోర్ట్ చేయదని యాపిల్ వెల్లడించింది. ఈ మేరకు ఐఓఎస్ 17 సాప్ట్వేర్ అప్డేట్కు అర్హత ఉన్న ఐఫోన్ల జాబితాను రిలీజ్ చేసింది. ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11, ఐఫోన్11 ప్రో, ఐఫోన్12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 13 , ఐఫోన్13 ప్రో, ఐఫోన్ 14, ఐఫోన్ 145 ప్రో ఫోన్లలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది.