Chat GPT: గూగుల్‌కు ప్రత్యామ్నాయం అవుతుందా?
Chat GPT: టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత అన్ని పనులు ఈజీ అయ్యాయి. ఆ పనులను మరింత ఈజీ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చింది. కమాండ్ కంట్రోల్ ద్వారా మనుషులతో అవసరం లేకుండా, కృత్రిమ మేధస్సును ఉపయోగించి పనులు చక్కబెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటి వరకుఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేసేవారు. అయితే, కొత్తగా రాబోతున్నా చాట్‌జీపీటీ మరింత అడ్వాన్స్‌గా ఆలోచించి పనులు చక్కదిద్దబొతున్నది. ఎలాంటి కఠినమైన ప్రశ్నలకైనా చాట్ బోట్ టెక్నాలజీ ద్వారా సమాధానాలు రాబట్టవచ్చు.
అదేవిధంగా మ్యూజిక్ కంపోజ్ నుండి పాటలు రాయడం వరకు కూడా చాట్‌బోట్ టెక్నాలజీ ద్వారా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యాలిఫోర్నియాకు చెందిన ఓపెన్ ఐ అనే సంస్థ చాట్‌జీపీటీని రూపొందించింది. ఏదైనా ఒక కంటెంట్‌ను రఫ్‌గా రాస్తే చాలు, ఆ కంటెంట్‌ను అర్థవంతంగా, అందంగా చాట్ జీపీటీ మార్చగలదు. ఏ అంశానికి సంబంధించిన చిన్న డేటాను అందిస్తే చాలు, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అర్ధవంతంగా వివరించగలు. దీనిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఓపెన్ ఐ ప్రయత్నాలు చేస్తున్నది. ఈ చాట్ జీపీటీ అందుబాటులోకి వస్తే గూగుల్ తో పని ఉండదని కొందరు చెబుతుంటే, కొందరు గూగుల్‌ను మించేలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కంప్యూటర్ సైంటిస్ట్ శామ్ అల్ట్‌మన్, ఇల్యా సల్స్ కెర్వర్, ఎలాన్ మస్క్ వంటివారు ఈ సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్లో భాగం పంచుకున్నారు. అయితే, ఎలాన్ మస్క్ ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ నుండి పక్కకు తప్పుకున్నారు. ఈ ప్రాజెక్టులో మైక్రోసాఫ్ట్ సంస్థ సైతం భారీగా పెట్టుబడులు పెట్టడం విశేషం.