Private Rocket Vikram-S: హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ నూతన శకానికి నాంది పలికింది. త్వరలో అంతరిక్షంలోకి ప్రవేట్ రాకెట్‌ను ప్రయోగించబోతుంది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్ విక్రమ్-ఎస్ నవంబర్ 12 నుంచి 16 మధ్య ప్రయోగానికి సిద్ధంగా ఉందని హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించింది.
స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క మొదటి మిషన్ కు ‘ప్రారంభ్’ అని నామకరణం చేసారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రయోగం శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లాంచ్‌ప్యాడ్ నుంచి జరుగనున్నది. నవంబర్ 12 నుంచి నవంబర్ 16 మధ్య లాంచ్ విండోను అధికారులు నోటిఫై చేశారని,వాతావరణ పరిస్థితులను బట్టి చివరి తేదీని నిర్ధారిస్తామని స్కైరూట్ ఏరోస్పేస్ CEO పవన్ కుమార్ చందన తెలిపారు.
ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో అంతరిక్షయాన్ని మరింత సులభతరం చేయడానికి ఈ ప్రాజెక్టును 2020లో ప్రారంభించారు. విక్రమ్-S రాకెట్ అనేది ఒకే-దశ ఉప-కక్ష్య ప్రయోగ వాహనం, ఇది మూడు కస్టమర్ పేలోడ్‌లను కలిగి ఉంటుంది. అంతరిక్షంలోకి ప్రవేట్ రాకెట్‌ను ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా అవతరించబోతుంది.