HP Sprocket Studio Plus Review: ఈ గ్యాడ్జెట్ చేతిలో ఉంటే చాలు…స్టూడియోతో పనిలేదు
HP Sprocket Studio Plus Review: స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటోలు తీసుకోవడం చాలా ఈజీ అయింది. ఫొటోగ్రాఫర్ సహాయం లేకుండా ఫొటోలను తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్న ఫొటోలను మెమరీ కార్డులోనో లేదంటే డ్రైవ్‌లోనో భద్రపరుచుకుంటాం. అయితే, ఇలా భద్రపరుచుకున్న వాటిని ప్రింట్ తీసుకోవాలి అంటే తప్పని సరిగా ఫొటో స్టూడియోకి వెళ్లి ప్రింట్ తెచ్చుకోవాలి. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదని అంటోంది హ్యులెట్ పాకార్డ్ సంస్థ. ఈ సంస్థ కంప్యూటర్ల ప్రింటర్లను తయారు చేస్తుంటుంది. అయితే, ఫొటో ఫ్రింట్ కోసం ప్రత్యేకంగా హ్యులెట్ పాకార్డ్ స్ప్రోకెట్ స్టూడియో ప్లస్ అనే ప్రింటర్‌ను తయారు చేసింది.
సింపుల్‌గా దీనిని హెపీ స్ప్రోకెట్ స్టూడియో ప్లస్ అని పిలుస్తారు. ఇది యాప్ ఆధారంగా పనిచేస్తుంది. యాప్‌ను మొబైల్ ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అవసరమైన ఫొటోను ఈ ప్రింటర్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు. అయితే, ఈ ప్రింటర్ కేవలం 6×4 సైజులో మాత్రమే ఫొటోలను ప్రింట్ చేయగలుగుతుంది. ఈ ప్రింటర్‌కు సంబంధించిన యాప్‌ను గూగుల్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్‌కు కనెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రింటర్ ఖరీదు మార్కెట్లో 149.99 డాలర్లుగా ఉన్నది. ఆండ్రాయిడ్, ఐఫోన్ ద్వారా ఫొటోలను ప్రింట్ చేసుకోవచ్చని ఈ ప్రింటర్ యాజమాన్య సంస్థ తెలియజేసింది. ప్రస్తుతానికి ఒక సైజులో ఉండే పొటోలను మాత్రమే ప్రింట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందని, ఈ మోడల్ సక్సెస్ అయితే, వివిధ సైజుల్లో ఫొటోలను ప్రింట్ తీసుకునే విధంగా ప్రింటర్లను తయారు చేస్తామని చెబుతున్నారు.