Mobile Hacked: ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఫోన్ హ్యాక్ అయినట్టే!
Mobile Hacked Symptomns: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. ఫోన్ లేకపోతే శరీరంలో ఒక భాగం లేనట్లుగానే చాలామంది ఫీల్ అవుతున్నారు. అయితే ఎంతగా మనిషి దానికి అలవాటు పడుతున్నాడో ఒక్కోసారి దానివల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో మొబైల్ హ్యాకింగ్ ఎక్కువ అవుతోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ మొబైల్ చూస్తూనే ఉంటారు కదా కొన్ని లక్షణాలు కనుక కనిపిస్తే మీ ఫోన్ హ్యాక్ అయినట్లేనని వారు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీ బ్యాటరీ బ్యాకప్ అసాధారణంగా తగ్గిపోతున్నా, మీరు వాడకుండానే మీ డేటా మొత్తం అయిపోతున్నా, మీరు ఉపయోగించే డేటా కంటే ఎక్కువ డేటా అయిపోతున్నట్లు అనిపిస్తున్నా మీ ఫోన్ హ్యాక్ అయి ఉండవచ్చని అంటున్నారు. అలాగే ఎక్కువ స్పీడ్ గా పని చేసే మీ ఫోన్ సడన్గా స్పీడ్ తగ్గిపోవడం కొన్నిసార్లు దానంతట అదే రీస్టార్ట్ అవ్వటం వంటి లక్షణాలు కూడా హ్యాకింగ్ లక్షణాలు అని చెబుతున్నారు. అయితే పాత మొబైల్స్ లో ఈ సమస్యలు వస్తే సర్వీస్ అయిపోయింది అనుకోవచ్చు కానీ కొత్తగా తీసుకున్న స్మార్ట్ ఫోన్స్ లో కూడా ఈ సమస్యలు వస్తే కచ్చితంగా హ్యాక్ అయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా థర్డ్ పార్టీ యాప్స్ ని ఉపయోగించడానికి ఆసక్తి చూపించవద్దని అలాగే యాప్ లకు అన్ని యాక్సెస్ ఇవ్వవద్దని వారు సూచిస్తున్నారు. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.