Google play: గూగుల్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నపుడు ఇది చెక్ చేశారా
Google play New Rule: ఈ మధ్య కాలంలో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. అన్ని పనులు అరచేతుల్లోనే అయిపోతున్నాయి కానీ ఒక్కో పనికి ఒక్కో యాప్ అందుబాటులోకి వస్తోంది. అయితే అసలు చిక్కంతా ఇక్కడే ఉందంటున్నారు టెక్ నిపుణులు. అదేమంటే యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో దానికి అవసరమైన అన్ని పర్మిషన్లు చాలా వరకు చూడకుండానే ఇచ్చేస్తూ ఉంటాం. అలా ఇవ్వడం వలన యూజర్లకు సంబంధించిన విలువైన, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సైబర్ నేరాగాళ్ల చేతిలోకి వెళ్తోందని వాదనలు వినిపిస్తున్న క్రమంలో అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్స్‌కు డేటా సేఫ్టీ పేరుతో ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్ల డేటా భద్రతకు గూగుల్ భరోసా కల్పించనుంది. కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం.. యూజర్లు యాప్‌లను ఇన్స్టాల్ చేసే సమయంలో యాప్ డెవలపర్ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనే సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయాల్సి ఉంటుంది.
అలా డెవలపర్ అందించిన సమాచారాన్ని గూగుల్ చెక్ చేసి నిబంధనలు పాటించిన యాప్‌లను తీసుకుని వాటిని యూజర్‌కు తెలిసేలా ప్లేస్టోర్‌లో ఉంచనుంది. ఒకవేళ యాప్ డెవలపర్ యూజర్ డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యకలపాలు జరిపినట్టు సిస్టం దృష్టికి వచ్చినా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. ఈ మేరకు జూలై 20 నాటికి ప్రతి యాప్ డెవలపర్ డేటా సేఫ్టీ డ్యాకుమెంట్ని సమర్పించాలని గూగుల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ డేటా సేఫ్టీ నిబంధనలను పాటించని యాప్‌లు ఏమైనా ఉంటే కనుక ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.