ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నవారికి 15 జీబీ ఫ్రీస్టోరేజ్ సౌకర్యాన్ని కల్పిస్తూ వచ్చింది. అయితే, దీనిని ఇప్పుడు 1 టీబీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. గూగుల్ అకౌంట్ తీసుకున్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఖాతాల్లో ఆటోమేటిగ్గా 1టీబీ సామర్థ్యం ఉండేలా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ సంస్థ తన వ్యక్తిగత బ్లాక్‌లో పేర్కొన్నది.
Google: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నవారికి 15 జీబీ ఫ్రీస్టోరేజ్ సౌకర్యాన్ని కల్పిస్తూ వచ్చింది. అయితే, దీనిని ఇప్పుడు 1 టీబీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. గూగుల్ అకౌంట్ తీసుకున్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఖాతాల్లో ఆటోమేటిగ్గా 1టీబీ సామర్థ్యం ఉండేలా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ సంస్థ తన వ్యక్తిగత బ్లాక్‌లో పేర్కొన్నది. స్టోరేజ్ 15 జీబీ నుంచి ఏకంగా 1టీబీ కి పెరగడంతో యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫొటో, వీడియో కంటెంట్ లను నిల్వ చేసుకునే వారికి ఇది నిజంగా గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు.
ప్రతి గూగుల్ వర్క్‌ప్లేస్ వ్యక్తిగత ఖాతా 1 టీబీ క్లౌడ్ స్టోరేజీతో వస్తుందని గూగుల్ తెలియజేసింది. దీనికోసం వినియోగదారులు ప్రత్యేకించి చేయాల్సింది ఏమీ లేదని, ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుతుందని గూగుల్ సంస్థ తెలియజేసింది. ఇక గూగుల్ డ్రైవ్ విషయానికి వస్తే, ఎన్నో రకాల ఫైల్స్‌ను డ్రైవ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఫైల్స్ ప్రొటెక్షన్ విషయంలోనూ సురక్షితంగా ఉంటుందని గూగుల్ పేర్కొన్నది.