Google Ex vice president on employees top skills: ఈ స్కిల్ ఉంటేనే ఉద్యోగం
Google Ex vice president on employees top skills: ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఒకప్పుడు ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంగా ఉండేది. కానీ, టెక్నాలజీ అభివృద్ధి సాధించిన తరువాత ఉద్యోగంతో పాటు జీతం కూడా భారీగా పెరిగింది. ఉద్యోగం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇదంతా మూడు నాలుగు నెలల క్రితం వరకు ప్రతి ఒక్కరిలో ఉన్న భావన. కంప్యూటర్ కోర్సు చేస్తే చాలు ఉద్యోగం సంపాదించవచ్చు… ఆరంకెల జీతం తీసుకోవచ్చు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టెక్ సంస్థలు ఎడాపెడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. సీనియార్టీతో సంబంధం లేకుండా ఉద్యోగాలను కోల్పోతున్నారు. దీంతో లింక్ట్ ఇన్ వంటి సోషల్ మీడియాలో ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులు వివిధ రకాలుగా మెసెజ్‌లు పెడుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే, గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ క్లైర్ హ్యూస్ జాన్సన్ ఓ సీక్రెట్ చెప్పారు. ఉద్యోగం కావాలని అనుకునే ఔత్సాహికులకు ఖచ్చితంగా ఓ స్కిల్ ఉండాలని చెప్పారు. అదే సెల్ఫ్ అవెర్‌నెస్. దీనినే మనం స్వీయ అవగాహన అంటాం. స్వీయ అవగాహన అంటే మన గురించి మనకు తెలియడం. మన గురించి మనకు ఎంత వరకు తెలుసు, దానిని ఎదుటివారికి ఎలా ఎక్పోజ్ చేస్తామన్నదాన్ని బట్టే మనకు ఉద్యోగం వస్తుందా రాదా అన్నది తేలిపోతుందని క్లైర్ హ్యూస్ పేర్కొన్నారు. తాను వారంలో 40 గంటలు ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నానని, అందరికి స్వీయ అవగాహన ఉంటుందని నమ్ముతారని, కానీ, సెల్ఫ్ అవేర్‌నెస్ గురించి స్పష్టమైన అవగాహన కేవలం 10 నుండి 15 శాతం మందికి మాత్రమే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ అవగాహన ఉన్నవారు తప్పకుండా వారి రంగంలో రాణిస్తారని తెలిపారు.