Gmail faces global outage: జీమెయిల్ సర్వీస్‌కు అంతరాయం, గగ్గోలు పెడుతున్న యూజర్స్
Gmail goes down for millions, Google says mitigation underway
గూగుల్ సంస్థకు చెందిన పాపులర్ జీమెయిల్ సర్వీస్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది యూజర్లు మెయిల్స్ పంపడంలోను, రిసీవ్ చేసుకోవడంలోను ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ సంస్థ కూడా ఈ విషయాన్ని తన డ్యాష్ బోర్డు ద్వారా అంగీకరించింది. ఈమెయిల్ డెలివరీలో డిలే జరుగుతున్నట్లు తెలిపింది. తమ ఇంజనీరింగ్ టీమ్ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కూడా గూగుల్ సంస్థ తెలిపింది. ఇంజనీరింగ్ టీమ్ ఈ సమస్యను పరిష్కరించి మెయిల్స్ త్వరగా చేరుకునే ఏర్పాటు చేస్తుందని గూగుల్ సంస్థ తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మంది ఈమెయిల్స్ వినియోగదారులున్నారు. 2022లో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్ కూడా జీమెయిల్ యాపే కావడం విశేషం.
జీమెయిల్ యాప్‌గానీ, డెస్క్ టాప్ వెర్షన్‌గానీ పనిచేయని కారణంగా కోట్లాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ట్విట్టర్ ద్వారా తమ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.
Is Gmail service down in India? Not able to send any emails nor receiving them from another end. @gmail
— Mr Mamun (@mamun_tweets) December 10, 2022