Cellphone Updates: సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయక పోతే వచ్చే నష్టాల గురించి తెలుసా?
Cellphone Updates: సెల్ ఫోన్ అందరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. పొద్దున లేచినప్పుడు చూసే మొదటి వస్తువు, రాత్రి పడుకొనేప్పుడు చూసే చివరి వస్తువు అదే. ఇలా నిత్యావసర వస్తువులా మారిన ఫోన్లలో ఛార్జింగ్ ఉందా? డేటా సరిపోతుందా? అని చెక్ చేసుకుంటున్నారు తప్ప. సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని చూడరు. ‘అప్‌డేట్ యువర్ డివైజ్’ అని మెసేజ్ వచ్చినా ‘తర్వాత చూసుకుందాంలే’ అని పక్కన పెడతారు. అయితే అప్‌డేట్ చేయనంత మాత్రాన నష్టం ఏముంది అనుకుంటే పొరపాటు పడినట్టే ఎందుకంటే అలా చేయకపోతే మనం కొత్త ఫీచర్లు కోల్పోతాం. నిజానికి మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటాయి, ఏవైనా లోపాలు ఉంటే సరిచేసి కొత్తగా రిలీజ్ చేస్తుంటాయి. అలాగే కంపెనీలు ఇచ్చే అప్డేట్లు ఫోన్ ఎక్కువ కాలం పనిచేయటానికి ఉపయోగపడతాయి. మొబైల్ కంపెనీలు విడుదల చేసే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లో కెమెరా పనితీరును మెరుగుపరచటంతో పాటు బ్యాటరీ లైఫ్‌నూ పెంచవచ్హుల్. ఈ అప్‌డేట్ మన ఫోన్‌పై జరిగే సైబర్ ఎటాక్స్ నుంచి రక్షణ కల్పించడానికి సాయపడుతుందని అంటున్నారు. పదే పదే అప్‌డేట్‌లు వస్తున్నాయి కదా అని విసుక్కోకుండా అప్‌డేట్ చేసుకోవడం మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.