Whatsapp Special Ringtone: వాట్సప్‌లో రింగ్‌టోన్‌ను ఇలా సెట్ చేసుకోండి
Whatsapp Special Ringtone: ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటున్నది. స్మార్ట్ ఫోన్ వినియోగించేవారు డీఫాల్ట్‌గా వాట్సప్‌ను కూడా వినియోగిస్తున్నారు. వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగానే వాట్సప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వాట్సప్‌లో రింగ్‌టోన్ డీఫాల్ట్‌గా మొబైల్ రింగ్ టోన్‌కు అనుబంధంగానే ఉండేది. అయితే, ఇప్పుడు యూజర్‌కు నచ్చిన విధంగా నచ్చిన రింగ్‌టోన్‌ను ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. దీనికోసం కొన్ని సింపుల్ స్టెప్స్‌ను ఫాలో అయితే నచ్చిన రింగ్‌టోన్‌ను నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సప్ ఓపెన్ చేసిన తరువాత కన్సర్జేషన్ ట్యాబ్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం కాంటాక్ట్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత కస్టమ్ రింగ్‌టోన్‌ను సెలక్ట్ చేయాలి. కస్టమ్ రింగ్ టోన్‌ను సెలక్ట్ చేసుకున్నాక పేజీని స్క్రోల్ డౌన్ చేసి కస్టమ్ నోటిఫికేషన్ ను సెలక్ట్ చేసుకొని యూజర్ కస్టమ్ నోటిఫికేషన్‌ను బాక్స్‌లో టిక్ చేయాలి. ఆ తరువాత, కాల్ నోటిఫికేషన్ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ కింద రింగ్ టోన్‌ను ట్యాప్ చేసి మనకు ఇష్టమైన రింగ్ టోన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారి కాంటాక్ట్‌కు తగిన విధంగా రింగ్ టోన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.