WhatsApp DND Mode : అందుబాటులోకి కొత్త ఫీచర్
వాట్సాప్ తాజాగా తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ను విడుదల చేసింది. బీటా అప్‌డేట్ వెర్షన్ లో ‘డోంట్ డిస్టర్బ్’ మోడ్‌ను రిలీజ్ చేసింది. అయితే ఇది iOS 15 సాఫ్ట్‌వేర్ తో ఉన్న iPhoneలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్‌లను కూడా బ్లాక్ చేయవచ్చు. వాట్సాప్ సెట్టింగ్స్ లో ‘డోంట్ డిస్టర్బ్’ మోడ్‌ను ఎనేబుల్ చేయొచ్చు. వినియోగదారులు మీటింగ్‌లకు హాజరు కావాలనుకున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ సహాయపడుతుంది. వారు నిర్దిష్ట సమయంలో ‘డోంట్ డిస్టర్బ్’ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. అంతే ఆ తరువాత ఇన్‌కమింగ్ కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్ ల వంటివి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేవు. అయితే, ఈ ఫీచర్ కేవలం iOS 15 సాఫ్ట్‌వేర్‌తో కూడిన iPhoneలు మరియు కొత్త వెర్షన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. iPhone iOS 12, 13, 14తో వంటి పాత వెర్షన్ లలో ‘డోంట్ డిస్టర్బ్’ మోడ్ పని చేయదు. ఇక అదే సమయంలో గ్రూప్ అడ్మిన్ లేదా ఇతర సభ్యులకు తెలియజేయకుండా వినియోగదారులను తెలివిగా గ్రూప్ నుండి నిష్క్రమించే ఆప్షన్ ను కూడా వాట్సాప్ తీసుకురావాలని యోచిస్తోంది. అలాగే వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్ ను కూడా పరీక్షిస్తోంది.