Digital payment users: రాకెట్ స్పీడ్‌తో పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ల వాడకం
Digital payment users in India to reach 700 million by 2030
భారత దేశంలో జనాభా కన్నా సెల్‌ఫోన్ల సంఖ్య ఎక్కువుగా ఉంది. ఒక్కొక్కరు కనీసం రెండు ఫోన్లు వాడే పరిస్థితులను ప్రస్తుతం చూస్తున్నాం. అదే విధంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య కూడా ప్రతి ఏటా లక్షల్లో పెరుగుతోంది. ప్రస్తుతం మనదేశంలో 780 మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 100 కోట్లకు చేరనుంది. రెడ్‌సీర్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్స్ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఆ సంస్థ చేపట్టిన సర్వేలో మరి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వాళ్లలో ఎక్కువ మంది ప్రతి రోజూ దాదాపు 7.3 గంటల పాటు వీక్షిస్తున్నారు. వెబ్‌సైట్లు చూడడం దగ్గర నుంచి వీడియోలు చూడడం వరకు చాలా విధాలుగా సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. ఆన్‌లైన్ మెసేజులు చేయడం, సోషల్ మీడియా వాడకం, ఓటీటీ కంటెంట్ చూడడం, షార్ట్ వీడియోలను చూడడం వంటివి చేస్తున్నారు. 2025 నాటికి డిజిటల్ మీడియా అనేది సంప్రదాయ మీడియాను పూర్తిగా అధిగమించనుంది.
ఇంగ్లిష్ మాట్లాడేవారు అధికంగా కలిగిన ప్రాంతాలపైనే అనేక గ్లోబల్ సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. స్థానికంగా వెలుస్తున్న సంస్థలు స్థానిక అవసరాలను తీర్చే విధంగా సేవలను అందిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో భారతదేశంలో డిజిటల్ వాడకం దారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ పేమెంట్ల వాడకం దారుల సంఖ్య 350 మిలియన్లుకు చేరింది. ఈ సంఖ్య 2030 నాటికి రెట్టింపు కానుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మరో ఏడేళ్ల కాలంలో భారతదేశంలో డిజిటల్ పేమెంట్ చేసే వారి సంఖ్య 700 మిలియన్లకు చేరనుంది.