Data backup with google takeout: గూగుల్ డేటాను ఇలా బ్యాకప్ చేయండి
Data backup with google takeout: మనం దేని గురించి సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకున్నా, వీడియోలను షేర్ చేసినా లేదా డౌన్‌లోడ్ చేసుకున్నా ప్రతిదీ ఇప్పుడు గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ అవుతుంది. గూగుల్ డ్రైవ్‌లో స్టోరేజ్ చేసుకోవడం కోసం మనకు 15 జీబీ వరకు ఫ్రీ స్టోరేజ్ సౌకర్యం ఉంటుంది. దీనికోసం తప్పనిసరిగా గూగుల్‌లో అకౌంట్ క్రియోట్ చేసుకోవలసి ఉంటుంది. అయితే, గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకున్న వాటిని బ్యాకప్ కింద డౌన్‌లోడ్ చేసుకునే అప్షన్ ఉన్నా అన్ని ఫైల్స్ ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం లేదు. దీనికోసమే గూగుల్ కొత్తగా టేక్ అవుట్ పేరుతో మరో ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా పెద్దమొత్తంలో డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
1 జీబీ నుండి 50 జీబీ వరకు డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం కొన్ని స్టెప్స్ ను ఫాలో కావలసి ఉంటుంది. ముందుగా గూగుల్ టేక్ అవుట్ అకౌంట్‌లో లాగిన్ అయిన తరువాత, కావలసిన ఫైల్‌ని ఎంచుకోవాలి. ఒకవేళ మీ డ్రైవ్‌కు సంబంధించి మొత్తం ఫైల్ కావాలని అనుకున్నా చేసుకోవచ్చు. ఫైల్‌ను సెలక్ట్ చేసుకున్నాక లింక్ మెయిల్‌కు వస్తుంది. ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు కావాలి, ఎంత డేటా కావాలి అనే విషయాలను తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం, డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్న డేటా లింక్ మెయిల్‌కు వస్తుంది. మెయిల్ లింక్‌ను ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.