ChatGPT: ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న పేరు చాట్పీజీటీ (ChatGPT app). ఓపెన్ఏఐ (Open AI) క్రియేట్ చేసిన చాట్‌జీపీటీ వరల్ల్ వైడ్‌గా సత్తా చాటుతోంది. ఒక టెక్ రంగంలోనే (Technology industry) కాకుండా అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. అయితే ఇన్నిరోజులు వెబ్‌లోనే అందుబాటులో ఉన్న ఈ చాట్పీజీటీ ఇప్పుడు యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. అది కూడా అందరికీ కాదు.. కేవలం యాపిల్ యూజర్లకు మాత్రమే.

కేవలం అమెరికా ఐఫోన్ యూజర్లకు మాత్రమే చాట్‌జీపీటీ యాప్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. అతి త్వరలో అన్ని దేశాలతో పాటు ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఐఫోన్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి నేరుగా డెడికేటెడ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. అమెరికా యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా అతికొద్దిరోజుల్లోనే ఇతర దేశాల్లో కూడా యాప్‌ను ప్రవేశ పెడుతామని వివరించింది. అలాగే చాట్‌జీపీటీ ఫీచర్లు, భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి తీసుకొస్తామని చెప్పింది.
త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లు కూడా ప్లేస్టోర్ నుంచి చాట్‌జీపీటీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తామని తెలిపింది. ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. దీనిని కూడా ముందుగా అమెరికా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని.. ఆ తర్వాత వరల్డ్ వైడ్‌గా విస్తరిస్తామని కంపెనీ పేర్కొంది.