Mojo Vision: 75% మంది ఉద్యోగులకు ఉధ్వాసన పలికిన మోజో విజన్
AR smart lens developer Mojo Vision lays off 75% of its employees
AR స్మార్ట్ లెన్స్ డెవలపర్ మోజో విజన్ తమ సంస్థలో 75 శాతం మంది ఉద్యోగులకు ఉధ్వాసన పలకనుంది. సంస్థ ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మోజో విజన్ సీఈఓ డ్రూ పెర్కిన్స్ తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఫోకస్ అంతా మైక్రో LED టెక్నాలజీపైనే ఉందని తెలిపారు. దీని కారణంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తప్పించాల్సి వస్తుందని సీఈఓ డ్రూ పెర్కిన్స్ తెలిపారు.
మోజో లెన్స్ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందని సీఈఓ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక అస్థిరత నెలకొన్నకారణంగా అదనపు పెట్టుబడులు ఆకర్షించడంలో విఫలం చెందామని డ్రూ పెర్కిన్స్ తెలిపారు. మైక్రో LED డిస్ ప్లే టెక్నాలజీపైనే ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు. ఇటుంటి ఉత్పత్తులకే మార్కెట్ పొటెన్షియల్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు.
టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారికి ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. వందలాది సంస్థలు వేలాది మంది ఉద్యోగులకు ఉధ్వాసన పలుకుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని ఆర్ధిక అస్థిరత కారణంగా కొలువులకు కోత విధిస్తున్నాయి. 2022లో ఏకంగా 853 కంపెనీలు 1,37,492 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఈ కొలువుల కోత ఈ ఏడాది కూడా కొనసాగనుంది. వేలాది మంది ఉద్యోగులు ఇంటి బాట పట్టనున్నారు.
California-based augmented reality smart contact lens developer Mojo Vision said it has laid off 75% of its employees.
#technology #news #technews pic.twitter.com/iLLsxUm2dx— JustTechUpdate (@JustTechUpdate) January 7, 2023
mojo