Apple: బ్లూ మెయిల్ సేవలకు చెక్ పెట్టిన యాపిల్, కారణం అదేనా..
Apple blocks email app BlueMail that uses ChatGPT technology
యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జాట్ జీపీటీ ఆధారిత ఈ మెయిల్ యాప్ బ్లూ మెయిల్ ను బ్లాక్ చేసింది. ఈ మెయిల్ చాట్ జీపీటీకి అనుసంధానం చేయడం ద్వారా పిల్లలు దీని నుంచి అనుచితమైన కంటెంట్ పొందే అవకాశముందని యాపిల్ కంపెనీ అనుమానిస్తోంది. ఈ కారణంతో యాపిల్ కంపెనీ ఈ మెయిల్ యాప్ అప్ డేట్ ను వాయిదా వేసింది.
బ్లూ మెయిల్ సంస్థ రూపొందించిన అప్ డేట్ విషయంలో యాపిల్ అభ్యంతరం తెలిపింది. ఈమెయిల్ కంపోజ్ చేసే సమయంలో చాట్ జీపీటీ సేవలు వినియోగించడం ద్వారా పాత కంటెంట్ ఉపయోగించడం జరుగుతుంది.
యాపిల్ టీమ్ బ్లూ మెయిల్ ఫీచర్లను పరిశీలించింది. పూర్తి స్థాయిలో రివ్యూ చేసింది. కంటెంట్ ఫిల్టరింగ్ లేదని గుర్తించింది. దీని కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిర్ధారించింది. దీంతో బ్లూ మెయిల్ అప్ డేట్ విషయంలో అడ్డు చెప్పింది.
బ్లూ మెయిల్ సంస్థ రూపొందించిన యాప్ యూజర్ల వయస్సు 17 సంవత్సరాలు దాటాలనే నిబంధన కూడా యాపిల్ సంస్థ విధించింది. ఈ విషయంలో బ్లూ మెయిల్ సంస్థ తీవ్ర అసంతృప్తితో ఉంది. యూజర్లు తమ సేవలను అందకుండా చేస్తోందని బాధను వ్యక్తం చేసింది.