The Museum of Living History : నెటిజన్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా చమత్కారం
Anand Mahindra’s reply to being asked if video has his voice amuses people : మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, పద్మ అవార్డు గ్రహీత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయనకు ట్విట్టర్లో 94 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయన ఎక్కువగా ప్రేరణాత్మక కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆయన చమత్కారాలకు నెటిజన్లు ఫిదా అవుతూ ఉంటారు. అయితే ఏం పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక తాజాగా ఆయన ది మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ అంటూ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వాయిస్ విన్న ఓ నెటిజన్ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తూ “ఇది మీ వాయిసేనా సర్ ?” అని అడిగాడు. వెంటనే స్పందించిన ఆనంద్ మహీంద్రా సదరు నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా “మీకు నచ్చితే నా వాయిస్సే.. నచ్చకపోతే నాది కాదు..(ఊరికే సరదాగా అంటున్నా..అది నా వాయిసే)” అంటూ చమత్కారంగా ట్వీట్ చేశారు.
If you’re happy with it, it is my voice and if you don’t like it, it isn’t! ( Just kidding; yes it’s my voice) https://t.co/TG1yczLSrk
— anand mahindra (@anandmahindra) July 11, 2022
అట్లాంటాలోని వరల్డ్ ఆఫ్ కోకా కోలా, స్టుట్గార్ట్లోని మెర్సిడెస్-బెంజ్ మ్యూజియం వంటి కార్పొరేట్ మ్యూజియంలు 1990 నుండి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. గత దశాబ్దంలో అనేక భారతీయ వారసత్వ సంస్థలు ముఖ్యంగా టాటా, అరవింద్ వంటి సంస్థలు కూడా ఇలాంటి మ్యూజియంలను ప్రారంభించాయి. తాజాగా మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ పేరుతో మహీంద్ర కూడా ఈ జాబితాలో చేరిపోయారు.
Presenting The Museum of Living History, where #PurposeMeetsDesign. It celebrates the philosophy, DNA, core values, and culture of the @MahindraRise Group and is a collection of stories that define us. Located at our HQ in Mumbai, it’ll soon be open for viewing by appointment pic.twitter.com/c5ew7YaEsZ
— anand mahindra (@anandmahindra) July 11, 2022