Airtel: ఎయిర్ టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్, అపరిమిత 5జీ డేటా వెసులుబాటు
Airtel offers unlimited 5G data offer its Customers
టెక్ కంపెనీల మధ్య ధరల పోటీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఎయిర్ టెల్, జియో కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి వినూత్న ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా ఎయిర్ టెల్ కంపెనీ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. పోస్టు పెయిడ్, ప్రీ పెయిడ్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది.
డేటా వినియోగంపై పరిమితులను ఎయిర్ టెల్ తొలగించింది. దీంతో కస్టమర్లు 5జీ ప్లస్ సర్వీసును అపరిమితంగా ఉపయోగించవచ్చు. పోస్టు పెయిడ్ కస్టమర్లు అందరితో పాటు రూ.239 ఆపైన డేటా ప్లాన్ లను కలిగిన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ప్రస్తుతం దేశంలో 270 ప్రాంతాల్లో ఎయిర్ టెల్ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేసిన అపరిమిత డేటా ఆఫర్ వినియోగించుకోడానికి 5జీ నెట్ వర్క్ సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్ ఉండాలి. అదే విధంగా 5జీ నెట్ వర్క్ పరిధిలో ఉండాలి. ఈ అపరమిత డేటా ఆఫర్ పొందాలని కోరుకునే వారు ఎయిర్ టెల్ థాంక్స్ యాప్ లోకి వెళ్లి ఆఫర్ యాక్టివేట్ చేసుకోవలసి ఉంటుంది.