5G services: దేశంలో 5జీ సేవల విస్తరణపై కేంద్రం ఏం చెప్పిందంటే..
5G telecom services have started in 50 towns
మన దేశంలో 5జీ సేవల విస్తరణ ఎలా ఉందనే విషయాన్ని కేంద్ర సమాచారా శాఖ సహాయ మంత్రి దేవుసింహ్ చౌహాన్ తెలిపారు. రాజ్యసభకు అందించిన సమాచారం ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ 26 నాటికి దేశంలో 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు.
5జీ సేవల స్వీకరణలో వస్తున్న ఇబ్బందుల గురించి రాజ్యసభ సభ్యులు కొందరు ప్రస్తావించారు. సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందించిన మంత్రి వివరణ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్ కోసం 5జీ స్పెక్ట్రమ్ రిజర్వ్ చేసి ఉంచినట్లు కూడా మంత్రి సభకు వివరించారు.