కేంద్ర ప్రభుత్వం 2023-24వ సంవత్సరానికి సంబందించి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ బడ్జెట్ 45.03 లక్షల కోట్లు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఏయే రంగాలకు ఊరట లభించింది. ఏయే రంగాలకు అభివృద్ధి సాధ్యం అవుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది రూపొందించిన బడ్జెట్లో ఎలక్ట్రానిక్, విద్యా, వైద్యం, వ్యవసాయ రుణాలకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చారు. దీంతో పాటు సామాన్యులకు ఊరట ఇచ్చే విధంగా పన్ను పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షలకు పెంచారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24లో తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా కేటాయింపులు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అనేక ప్రతిపాదనలను కేంద్రం పక్కన పెట్టింది. బడ్జెట్ లో వాటి ప్రస్తావనే చేయలేదు. సింగరేణి కంపెనీకి రూ.1650 కోట్లు ప్రకటించింది. ఏపీలో కలిసి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఓ చిన్న మొత్తం ప్రకటించింది. దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదు. దీంతో గులాబీ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో వివిధ రంగాలకు పెద్ద మొత్తంలో కేటాయింపులు కేటాయించారు. పేపర్ పాస్‌పోర్టుల స్థానంలో ఈ పాస్ పోర్టులను రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పాస్ పోర్టులకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించింది.
కేంద్రం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్లో సామాన్యులకు కొంత ఊరటనిచ్చే విధంగా పన్నురాయితీలు, పరిమితులు ఇచ్చారు. కాగా, బడ్జెట్లో నిరుద్యోగులకు లబ్ది చేకూరే విధంగాగాని, ద్రవ్యోల్భణాన్ని నియంత్రించేందుకుగాని అవసరమైన ప్రణాళికలు లేవని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఈరోజు కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందరూ ఊహించినట్లుగానే ఈ బడ్జెట్లో సామాన్యులకు ఊరటనిచ్చే అంశాలను ప్రతిపాదించారు. పన్నురాయితీలను ప్రకటించారు. ఇప్పటి వరకు రూ. 5 లక్షల వరకు పన్ను మినహాంపులు ప్రకటించగా, తాజాగా పన్ను మినహాయింపులు రూ. 7 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిరాశ వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ లో విభజన చట్టం లోని అంశాలు, హామీలు ప్రస్తావన లేదని, అందుకే బడ్జెట్ ఎంతో నిరాశను కలిగించిందని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు. ప్రస్తావన లేదని బాధను వ్యక్తం చేశారు. విభజన అంశాలపై పార్లమెంట్ లో మా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
PM Awas Yojana allocation increased to Rs 79,000 crore కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023లో పీఎం ఆవాస్ యోజన పథకానికి భారీ నిదులు కేటాయించారు. ఏకంగా 66 శాతం నిధులను పెంచారు. 79,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. పీఎం ఆవాస్ యోజన కింద లబ్ధిపొందేవారి కోసం గడువు కాలాన్ని పొడిగించారు. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు అవకాశం కల్పించారు. పీఎం ఆవాస్ యోజన పథకానికి భారీ కేటాయింపులు […]
Budget 2023-24: What’s cheaper, What’s costlier: కేంద్రం ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించారు. అందులో కస్టమ్స్ డ్యూటీ మార్పులతో కొన్ని వస్తువుల ధరలు పెరగటం.. మరి కొన్ని తగ్గదులకు ఈ నిర్ణయం దోహదం చేస్తోంది. బడ్జెట్లో మొబైల్స్, టీవీలు, కెమెరాల విడిభాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ ని తగ్గిస్తూ కేంద్ర మంత్రి ప్రతిపాదించారు. దిగుమతి చేసుకునే బంగారు ఆభరణాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. అలాగే […]
కేంద్ర బడ్జెట్ లో రైల్వే శాఖకు భారీ కేటాయింపులు జరిగాయి. 2.4 లక్షల కోట్ల మూలధన వ్యయం కేటాయించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ మొత్తం 66 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేటాయించిన మొత్తం 2013లో కేటాయించిన మొత్తానికి 9 రెట్లు ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
Budget 2023: FM announces change in income tax slabs, up to Rs 7 lakh rebate under new income tax regime: కేంద్రం వేతన జీవులకు ఊరట కలిగించింది. వ్యక్తిగత పన్ను పరిమితిని పెంచింది. ఇప్పటి వరకు అయిదు లక్షలుగా ఉన్న పరిమితిని రూ 7 లక్షలకు పెంచింది. 2023-24 వార్షిక బడ్జెట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను శ్లాబ్ మర్పులను ప్రతిపాదించారు. ఏడు లక్షల ఆదాయ […]