తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఆర్.కె.గౌడ్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగులు బంద్ చేస్తామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. చిత్ర పరిశ్రమ కేవలం ఏ నలుగురికో చెందినది కాదని స్పష్టం చేశారు. అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు