తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన గత కొంత కాలంగా జరుగుతూనే ఉంది. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని కర్తవ్యబోధ చేశారు. తాజాగా ఆ జాబితాలో మంత్రి కేటీఆర్ చేరారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ సభలో మంత్రి కేటీఆర్ స్వయంగా ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించారు
Telangana BJP MP Bapurao likely to get Chance in Central Cabinet: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెలాఖరులో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 31న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆలోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది తెలంగాణతో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నందున ఈ రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రాధాన్యం ఉండొచ్చని తెలుస్తోంది. తెలంగాణలో […]
Sharmila Selects a safe Seat for Telangana Assembly Elections: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ఎన్నికల రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడానికి ఒక సేఫ్ సీటును ఎంచుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని షర్మిల శుక్రవారం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలోని ప్రధాన జిల్లాల్లో ఒకటైన ఖమ్మంలో ఆమె పోరుకు దిగనుండడం అనేకమందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఆంధ్రా, తెలంగాణా సరిహద్దుల్లో ఉన్న […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ వేలకోట్ల రూపాయల నిధులు ఇస్తుంటే.... కేసీఆర్ సహకరించడం లేదని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విజయం సాధించింది. ఏకంగా 156 స్థానాల్లో విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ జరుగుతుందని అనుకున్నా, ఫలితాలు ఏకపక్షంగా రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సైతం ఖంగుతిన్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఎన్నడూ ఓటమిపాలవ్వలేదు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 స్థానాల్లో విజయం సాధించింది.
KCR Steps Ahead Early polls: తెలంగాణ ముందస్తు పై ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ముందస్తుకు అవకాశమే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసారు. సిట్టింగ్ లకు తిరిగి సీట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర కొద్ది రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలు ముందస్తు ఖాయమనే ప్రచారానికి ఊతం ఇస్తున్నాయి. హైదరాబాద్ నగరం కేంద్రంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుస జిల్లాల పర్యటనలతో కేడర్ లో జోష్ పెంచుతున్నారు. కేంద్రం తెలంగాణలో టీఆర్ఎస్ నేతల లక్ష్యంగా […]
తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన పలువురు నాయకుల నోట వినిపిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని కేడర్‌కు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఓ విషయంలో క్లారిటీ ఇచ్చారు. టిక్కెట్ల కేటాయింపులో జాతీయ నాయకత్వానిదే ఫైనల్ అని బండి సంజయ్ స్పష్టం చేశారు
తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఎన్నికల కోసం ఉరుకులాడుతున్నాడని, కార్యకర్తలు అంతా ఎన్నికలకు సిద్ధం అవ్వండని పిలుపునిచ్చారు. తనను సీఎం కావాలని చాలా మంది అంటున్నారని, నేను సీఎం అయినా కాకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం చారిత్రాత్మక అవసరమని అన్నారు.
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకపైపు బీజేపీ, వైఎస్ఆర్టీపీ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తున్నది. ఆ పార్టీని ఎదుర్కొనే ఏకైక పార్టీగా రాష్ట్రంలో అవతరించిందనడంలో సందేహం అవసరం లేదు. గతంలో కంటే బీజేపీ భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నది. 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్, బీజేపీ మధ్య సయోద్య ఉన్నది.
2014లో రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేది. కానీ, ఇప్పుడు అప్పుల కుప్పగా మారిపోయింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మిగులు రాష్ట్రం అప్పుల మయంగా మారిపోవడానికి సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు, పరిపాలన విధానాలే కారణమని విమర్శించారు. ప్రతి ఏటా వడ్డీలకే రూ. 30 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని విమర్శించారు.