భారత్ 2023లో జరిగే జీ 20 సమావేశాలకు అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో నిర్వహణపై ప్రధాని మోడి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేశంలోని 40 పార్టీలకు ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. జీ 20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడం దేశం యొక్క శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని, మన సత్తా చాటేందుకు ఇదొక సువర్ణావకాశమని ప్రధాని మోడీ పేర్కొన్నారు.