ఐపీఎల్ జర్నీని విజయంతో ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ జట్టును ప్రస్తుతం ఓ సమస్య వేధిస్తోంది. చెన్నైతో జరిగిన మ్యాచులో గాయపడ్డ కేన్ విలియమ్ సన్ స్థానంలో ఎవరిని తీసుకోవాలా అనే విషయంలో సందిగ్ఢం నెలకొంది. స్టీవ్ స్మిత్ వచ్చే అవకాశం ఉందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్టీవ్ స్మిత్ స్పందించాడు. తాను అసలు ఐపీఎల్ వేలంలోనే పాల్గొనలేదని చెప్పాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొనని తనకు ఆడే ఛాన్స్ వస్తుందా లేదా అనే విషయం తెలియదని స్పష్టం చేశాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2023 సీజన్ రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై పంజాబ్ కింగ్స్ 7 పరుగులతో విజయం సాధించింది.
IPL 2023 SRH Vs RR: హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ మొదలైంది. నగరంలో మూడేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. మండుతున్న ఎండలను కూడా లెక్క చేయకుండా క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ కు సిద్దమయ్యారు. ఈ రోజు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో తమ తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. వరుసగా రెండు సీజన్లలో వైఫల్యం నేపథ్యంలో కోచ్, కెప్టెన్‌తో సహా పూర్తి ప్రక్షాళన చేసిన […]
ఐపీఎల్ టోర్నీలో భాగంగా మూడో మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. లక్నో జట్టును బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతున్నాయి.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు నగర నలుమూలల నుంచి క్రికెట్ అభిమానులు వేలాదిగా తరలి రానున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో సంస్థ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. అదే విధంగా తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది.
మొహాలీలో జరుగుతున్న ఐపీఎల్ రెండో మ్యాచులో పంజాబ్ జట్టు 191 పరుగులు చేసింది. 5 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసింది. రాజపక్సే అద్భుతంగా ఆడి కోల్ కతా బౌలర్లను బెంబేలెత్తించాడు. తొలి సీజన్ ఆడుతున్న రాజపక్సే అదరహో అనిపించాడు. కేవలం 32 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. 5 బౌండరీలు, 2 సిక్సర్లతో అర్ధశతకం సాధించాడు. సరిగ్గా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
ఐపీఎల్ టోర్నీలో రెండో మ్యాచ్ ప్రారంభం అయింది. మొహాలీలో జరుగుతున్న ఈ మ్యాచులో పంజాబ్ జట్టు కోల్ కతా జట్టుతో తలపడుతోంది. కోల్ కతా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టును బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది తన ఐపీఎల్ జర్నీని ఏప్రిల్ 2 నుంచి ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఆరెంజ్ ఆర్మీ విజయంతో తన ప్రయాణం ప్రారంభించాలని భావిస్తోంది.
హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ ఫీవర్ మొదలయింది. రేపు మధ్యాహ్నం ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ జట్టుతో తలపడనుంది. దీంతో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నగర పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు.
తొలి మ్యాచులో పంజాబ్ కింగ్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. మరో మ్యాచులో లక్నో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడనుంది. తొలి మ్యాచ్ పంజాబ్ రాష్ట్రంలో జరగనుండగా, రెండో మ్యాచ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనుంది. ఈ రోజు జరిగే రెండు మ్యాచులకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.