Hyderabad: దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం వినియోగిస్తారు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.3 కిలోమీటర్ల సర్క్యుట్ […]
భాగ్యనగరానికి అనేక అంతర్జాతీయ కంపెనీలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కంపెనీల కార్యాలయాలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కు భాగ్యనగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. ఇప్పుడు మరో అంతర్జాతీయ క్రీడకు భాగ్యనగరం వేదికగా మారనున్నది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రీడల్లో ఫార్ములా వన్ రేస్ ఒకటి. ఈ ఫార్ములా రేస్ హైదరాబాద్‌లో జరగబోతున్నది. దీనికోసం హుస్సేన్ సాగర్ తీరంలో ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మహానగరంలో ఫార్ములా ఈ రేస్ ను నిర్వహంచబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ 2023 ఫిబ్రవరి 11 వ తేదీన ప్రారంభం కానున్నది. ఈ ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండీఏ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నది. నెక్లెస్‌రోడ్‌లో 2.7 కిమీ మార్గంలో ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గంటకు 200 నుంచి 300 కిమీ వేగంతో దూసుకపోయే వాహనాలకు అనుకూలంగా ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నెక్లెస్ రోడ్ తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి వెళ్లే విధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు.