ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఈడీ 181 పేజీల ఛార్జ్‌షీటును తయారు చేసింది. ఈ ఛార్జీషీటులో కవిత పేరును 28 సార్లు పేర్కొన్నది. ఈ కేసులో ఏ1 గా ఉన్న సమీర్ మహేంద్రుతో కలిసి కవిత లిక్కర్ వ్యాపారం చేశారని, హైదరాబాద్‌లో అనేక మార్లు వీరు భేటీ అయ్యారని ఛార్జ్షీటులో పేర్కొన్నారు. ఇక ఈ ఛార్జ్‌షీటును కోర్టు స్వీకరించడంతో కవితకు కష్టాలు మొదలయ్యాయి. కవిత తరపున రామచంద్ర పిళ్లై అన్నీ దగ్గరుండి చూసుకున్నారని ఈడీ ఛార్జీషీటులో పేర్కొన్నది.
ఆదివారం రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారించారు. 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరిగింది. ఈ కేసులో తమకు కావాల్సిన పత్రాలు, డాక్యుమెంట్స్ సాక్షాలు ఇవ్వాలని 91 నోటీసుల్లో పేర్కొన్నారు. 91 సీఆర్పీసీ విచారణ వివరాలను, తేదీలను, ప్లేస్‌లో త్వరలోనే మెయిల్ ద్వారా తెలియజేస్తామని సీబీఐ అధికారులు కవితకు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా ఈ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో విచారించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 6.30 వరకు సాగింది. ఏడున్నర గంటల పాటు కవిత ఇంట్లోనే ఉన్న విచారణ అధికారులు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. కవిత చెప్పిన సమాధానాలను రికార్డు చేశారు.
CBI Decided to question MLC Kavitha on 11th of this month in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కవితను ఈ నెల 11న సీబీఐ విచారించనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వతేదీన విచారణ నిర్వహించేందుకు నిర్ణయించింది. కానీ, కవిత ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ పంపాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసింది. సీబీఐ నుంచి ఆ […]
డిసెంబర్ 6 వ తేదీన విచారణకు రెడీగా ఉండాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని కవిత ఇంట్లోనే విచారణ నిర్వహిస్తామని సీబీఐ నోటీసుల్లో పేర్కొన్నది. దీనికి కవిత కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, కవిత సీబీఐ నుంచి కొన్ని డాక్యుమెంట్స్‌ను కోరారు. అంతేకాకుండా, సీబీఐకి కవిత మరో లేఖ కూడా రాశారు. ముందుగా అనుకున్న విధంగా తాను డిసెంబర్ 6 వ తేదీన అందుబాటులో ఉండలేనని, ముందుగా ఖరారైన కార్యక్రమాల వలన ఈరోజు సమావేశం కాలేనని ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు.
ఎమ్మెల్సీ కవిత సీబీఐకి మరో లేఖ రాశారు. సీబీఐ కోరినట్లుగా తాను రేపు విచారణకు హాజరు కాలేనని తెలిపారు. సీబీఐ తన వెబ్ సైట్లో పొందుపరిచిన FIRని తాను క్షుణ్ణంగా పరిశీలించానని, అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశానని, దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నానని కవిత తెలిపారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల 6న సమావేశం కాలేనని కవిత సీబీఐకి తెలిపారు.
MLC Kavitha asks for Supporting Documents in Delhi Liquor Scam: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారణకు హాజరు కమ్మని సీబీఐ కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. సీబీఐకు కవిత లేఖ రాశారు. ఈ కేసులో క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 […]
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నుంచి పిలుపురావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసు పంపింది. ఢిల్లీ కార్యాలయానికి గానీ, హైదరాబాద్ కార్యాలయానికి గానీ రావాలని సూచించింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయమై తన తండ్రి కేసీఆర్‌తో చర్చించేందుకు కవిత ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ రిమాండ్ రిపోర్ట్‌ను బహిర్గతం చేసింది. ఈ రిపోర్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతల పేర్లు కూడా ఉండటంతో ఒక్కసారిగా అలజడి రేగింది. రిమాండ్ రిపోర్ట్‌లో కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండటంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఈడీ రిపోర్ట్ పై కవిత స్పందించారు. దేశంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల కాలంలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అధికారాన్ని సొంతం చేసుకున్నారని, ప్రజాస్వామ్యయుతంగా గెలవాలి తప్పించి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని ప్రభుత్వాలను కూలగొట్టడం సరికాదని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో నిందితుల్లో ఏడుగురిపై 10,000 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసింది. అనూహ్యంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేరు చార్జ్ షీటులో లేకపోవడం గమనార్హం విజయ్ నాయర్, అభిషేక్ సింగ్, అరుణ్ పిళ్లై, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రు, నరేందర్ సింగ్ పేర్లు చార్జ్ షీటులో ఉన్నాయి.