చైనాలో కరోనా కేసులు లక్షల సంఖ్యలో నమోదువుతున్నాయి. కేసులతో పాటు ఉదృతి కూడా పెరుగుతుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా రోగులే కనిపిస్తున్నారు. వైద్య సదుపాయాల కొరత ఆ దేశంలో తీవ్రంగా కనిపిస్తున్నది. కేసులతో అల్లకల్లోలంగా మారడంతో వైద్యారోగ్యశాఖ చేతులెత్తేసే పరిస్థితులు సంభవించాయి. కొత్తగా నమోదువుతున్న కేసుల వివరాలను ఆ దేశం బయటపెట్టడం లేదు. చిన్న ఆసుపత్రుల నుండి కార్పోరేట్ ఆసుపత్రుల వరకు కరోనా రోగులతోనే నిండిపోయింది. ఆసుపత్రుల్లోని మార్చురీలు సైతం శవాలతో నిండిపోయింది.
కరోనా పుట్టినిల్లు చైనాలో కరోనా కేసులు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కోవిడ్ రోగులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని బీజింగ్‌లో పరిస్థితులు చేజారిపోతున్నాయనే ఆందోళన మొదలైంది. జీరో కోవిడ్ పాలసీతో కట్టడి చేయాలని చూసిన చైనా, చివరకు ఆ పాలసీని ఎత్తివేయడంతో ఒక్కసారిగా కేసులు తారాస్థాయికి చేరుకోవంతో వైద్యారోగ్యశాఖ చేతులు ఎత్తివేసే పరిస్థితికి వచ్చింది. కోవిడ్ కేసుల సంఖ్యను ఆ దేశం ప్రకటించడం లేదు. దీంతో ప్రపంచదేశాల్లో ఆందోళన మొదలైంది. అనధికారికంగా రోజుకు 9 వేల మంది వరకు కరోనాతో మృతి చెందుతున్నారనే వార్తలు వస్తుండంటంతో ఒక్కసారిగా ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కేసులు దేశంలోకూడా ఎంటరైంది. ఒమైక్రాన్ బీఎఫ్ 7 తో పాటు, ఎక్స్ బీబీ, ఎక్స్ బీబీ 1.5 వేరియంట్లు వణిస్తున్నాయి. కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందేందుకు ఈ వేరియంట్లు కారణమౌతున్నాయి. తాజాగా తెలంగాణలో ఎక్స్‌బీబీ 1.5 వేరియంట్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. కొత్తగా తెలంగాణలో, చత్తీస్‌గడ్‌లో ఒక కేసు చొప్పున నమోదైనట్లు ఇన్ఫాకాగ్ తెలియజేసింది. దేశంలో ఇప్పటి వరకు ఈ వేరియంట్ కేసులు ఏడు నమోదైనట్లు ఇన్ఫాకాగ్ తెలియజేసింది.
చైనా ఇప్పటికే కరోనా వైరస్ కోరల్లో మళ్లీ చిక్కుకుంది. ఒమిక్రాన్ ఉప వేరియంట్ BF.7 ఆ దేశంలో అత్యంత వేగంగా పాకుతోంది. చైనాలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య ప్రపంచాన్ని భయపెట్టేలా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. చైనాలో కరోనా మరణమృదంగాన్ని సృష్టిస్తుండగా, అమెరికా, ఇంగ్లాండ్, దక్షిణ కొరియాతో పాటు అనేక ఆసియా, అమెరికా, యూరప్ దేశాల్లోనూ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కరోనా కేసుల పెరుగుదలపై ఇప్పటికే కేంద్రం అలర్ట్ చేసింది. కరోనా కేసులు పెరగడానికి కారణమైన సబ్ వేరియంట్ ఎక్స్ఎక్స్బి వేరియంట్ కేసులు ఇప్పటికే కొన్ని బయటపడ్డాయి. దీనితో పాటు మరో సబ్ వేరియంట్ ఎక్స్ఎక్స్బి 1.5 కేసులను కూడా భారత్‌లో గుర్తించారు. గుజరాత్లో 3, కర్ణాటక, రాజస్థాన్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ఇన్ఫాకాగ్ తెలియజేసింది.
తెలంగాణలో అనేక కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండేళ్లుగా ఇబ్బందులు పెట్టిన కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లను ప్రారంభించారు. కరోనా భయంతో స్కూల్స్ ఓపెన్ చేసినా విద్యార్థులను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ఒకటికి నాలుగుమార్లు ఆలోచించారు. విద్యాశాఖ అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రస్తుతం నార్మల్ గా స్కూళ్లు జరుగుతున్నాయి. ఇక, ప్రతి రెండేళ్లకు ఒకమారు నిర్వహించే సమ్మక్క సారలమ్మ వనజాతరను ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని అంగరంగ వైభవంగా నిర్వహించింది. నిర్వహణకోసం సుమారు ప్రభుత్వం రూ. 100 కోట్లను వెచ్చించింది. కరోనా కారణంగా బయలకురాని ప్రజలు, ఈ జాతరకు పోటెత్తారు. కోటిన్నరమంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేదిలేదంటోంది ఉత్తర కొరియా. తాజాగా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. బాలిస్టిక్ క్షిపణితో పాటు ఐదు డ్రోన్లు కూడా సరిహద్దు గుండా దూసుకుపోయాయని దక్షిణ అమెరికా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా చేస్తున్న ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని, కిమ్ ఎప్పుడు ఎలాంటి ప్రయోగాలు చేపడతాడో తెలియడం లేదని, పరిస్థితులు ఈ విధంగానే కొనసాగితే ఇబ్బందులు తప్పవని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. దక్షిణ కొరియాలో ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి.
చైనాలో కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరాయి. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 30 కోట్ల మందికి పైగా కరోనా సోకింది. జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేయడంతో కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ విషయంలోనూ చైనా సరైన ప్రణాళికలు తీసుకోలేదు. ఇదే ప్రపంచ దేశాలకు ఇబ్బందికరంగా మారింది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో లీకవుతున్న పోస్టులను బట్టి తెలుస్తోంది. కేసులు పెరుగుతుండటంతో గణాంకాలను వెలువరించడం నిలిపివేసింది. దీంతో చైనాపై డబ్ల్యూహెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభంజనం సృష్టిస్తున్న వేళ భారత్ అప్రమత్తమైంది. కోవిడ్ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే అర్హులైన కోట్లాది మందికి కోవిడ్ వ్యాక్సిన్లను అందించింది. కాగా, ఇప్పటి వరకు సూది మందు ద్వారా వ్యాక్సిన్లను అందించగా, ఇప్పుడు ముక్కు ద్వారా అందించే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన నాజల్ వ్యాక్సిన్ ఇన్కోవ్యాక్ కు ఇటీవలే డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు లభించాయి.
చైనాలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ప్రపంచదేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే అమెరికా, జపాన్, దక్షిణకొరియా, బ్రెజిల్ తదితర దేశాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక, ఇండియాలలోనూ క్రమంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్ 11-18 తో పోలిస్తే ఆ తరువాతి వారంలో కేసులు స్వల్పంగా పెరిగాయి. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ తో కలిపి మొత్తం 16 రాష్ట్రాల్లో కేసులు స్పల్పంగా పెరిగాయి. కేసులతో పాటు మరణాల సంఖ్యకూడా స్వల్పంగా పెరిగింది.